చద్దన్నం గురించి తెలిస్తే షాకవుతారు ?

Health Benefits Of Night Rice

01:19 PM ON 18th July, 2016 By Mirchi Vilas

Health Benefits Of Night Rice

పూర్వం చద్దన్నం అంటే, ఎంతో డిమాండ్ ఉండేది. ఇంటిల్లిపాదీ మూడు పూటలా అన్నం తినడం అంటే చద్దన్నంతో మొదలవుతుంది. ఇప్పుడంటే టిఫిన్ల సంస్కృతి పెరిగింది గానీ, ఒకప్పడు చద్దన్నమే పరమాన్నం కన్నా ఎక్కువ. పైగా పోషక విలువలు కూడా ఎక్కువ ఉండేవని అంటారు. ప్రస్తుతం రాత్రి మిగిలి పోయిన అన్నం పొద్దున్నే తినేందుకు ప్రస్తుత జనాలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నైట్ అన్నం ఎంత ఉన్నా కూడా పొద్దున్నే పడేయడం కాని, ఎవరికైనా పెట్టడం కాని(ఎవరూ తీసుకోవడం లేదు కూడా) చేస్తూ ఉంటారు. అయితే ఆ చద్దన్నంలోనే ఎన్నో ఉపయోగకరమైన పదార్ధాలు ఉన్నాయనే విషయం తెలుసుకుంటే, వావ్ అంటారు. అందుకే 'పెద్దల మాట చద్ది మూట' అనే సామెత ఉందనే ఉంది.

1/8 Pages

చద్దన్నం తినడం వల్ల శరీరంలో చాలా మార్పులు వస్తాయని ఒక సర్వేలో కూడా తేలింది. పాత తరం వారు చద్దన్నంను ఎంతో ఇష్టంగా తినడం వలన, వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉండేదని అంటారు. మన తాతల కాలంలో రాత్రి వండిన అన్నంను పొద్దున్నో పెరుగు కలుపుకుని, మామిడి కాయ చట్నీ వేసుకుని, పచ్చి మిర్చి గానీ , ఉల్లిగడ్డ గానీ నంజుకుని తింటే బాగుంటుంది. కాని ఇప్పుడు చూద్దాం అన్నా ఏ ఒక్కరు కూడా అలా తినడం లేదు. పల్లెటూరులో సైతం రాత్రి అన్నం పశువులకు పెట్టడం మనం చూస్తున్నాం.

English summary

Health Benefits Of Night Rice