ఉల్లిపాయ ప్రయోజనాలు

Health Benefits of onions

03:39 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Health Benefits of onions

ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదని మన అందరికి తెలిసిన విషయమే. ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కాపాడుతుంది. మనం జబ్బు పడినప్పుడు లేదా త్వరగా నయం కావటానికి ఉల్లిపాయ మంచి ప్రత్యామ్నాయ మందు అని చెప్పవచ్చు.

కొంత మంది ఉల్లిపాయకు ఉండే ఘాటైన వాసన కారణంగా ఉల్లిపాయను తినటానికి ఇష్టపడరు. కానీ ఉల్లిపాయలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిని దాదాపుగా అన్ని వంటల్లోనూ వాడటం వలన, ఉల్లిపాయను తీసుకోవటం చాలా సులభం. ఉల్లిపాయలో ఉండే అనేక రసాయనాలు అనారోగ్యం దరి చేరకుండా చూస్తాయి. ఇక్కడ ఉల్లిపాయ వలన కలిగే అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ఉల్లిపాయ ప్రయోజనాలు

1. ఉల్లిపాయలో యాంటిబయోటిక్, ఏంటి సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉండుట వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
2. ఉల్లిపాయలో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువగా ఉంటాయి.
3. ఉల్లిపాయ రసం మరియు తేనె యొక్క మిశ్రమంను తీసుకుంటే జ్వరం, సాధారణ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అలెర్జీల వంటి సమస్యలకు తక్షణ ఉపశమనం కలుగుతుంది.
4. ఉల్లిపాయ ముక్కను నుదుటి మీద పెడితే జ్వరం యొక్క దుష్ప్రభావాలకు వ్యతిరేకంగా పని చేస్తుంది.
5.  ఉల్లిపాయ ముక్క వాసనను పిల్చేతే, ముక్కు నుండి వచ్చే రక్త స్రావాన్ని ఆపవచ్చు లేదా వేగాన్ని తగ్గించవచ్చు.
6. ఉల్లిపాయ నిద్రలేమి లేదా నిద్ర రుగ్మతలను నయం చేయటంలో సహాయపడుతుంది. ఇది ఖచ్చితంగా మంచి నిద్రను ఇస్తుంది.
7. జీర్ణక్రియ సమస్యలు ఉన్నప్పుడు ఉల్లిపాయను తింటే జీర్ణక్రియకు సహాయం చేసే జీర్ణ రసాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
8. ఉల్లిపాయ రసం కాలిన చర్మం లేదా కీటకాల కాటు లేదా తేనెటీగ కాటులను నయం చేయటంలో సమర్థవంతంగా పనిచేస్తుంది.
9. ఉల్లిపాయలు క్యాన్సర్లను నిరోధించడానికి సహాయపడతాయి. ఇది తల, మెడ మరియు పెద్దప్రేగు క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
10. ప్రతి రోజు ఆహారంలో ఉల్లిపాయను బాగంగా చేసుకుంటే, అస్టియోపోరోసిస్ మరియు అథెరోస్క్లెరోసిస్ నుండి రక్షణ కలుగుతుంది.
11. ఉల్లిపాయలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచటానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం ద్వారా  మధుమేహ చికిత్సలో సహాయపడతాయి.
12. ప్రతి రోజు ఉల్లిపాయ తింటే గుండె వ్యాధులకు కారణం అయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. అంతేకాక మంచి కొలస్ట్రాల్ ను పెంచి కొరోనరీ వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది.
13. కీళ్ళలో ఆర్థరైటిస్  తగ్గించటానికి ఉల్లిపాయ సహాయపడుతుంది.
14. నువ్వుల నూనె లేదా అముదంలో ఉల్లిపాయలను వేగించి ఉపయోగిస్తే ఒంటి నొప్పులు మాయం అవుతాయి.
15. ఉల్లిపాయ రసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని పాచెస్ లేదా పిగ్మేంట్ తొలగించటానికి సహాయపడుతుంది.
16. ఉల్లిపాయ రసంను చెవి మరియు కంటి సమస్యలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
17. దంతాల నొప్పి మరియు పిప్పి పన్ను నొప్పి నివారణకు ఉల్లిపాయ రసాన్ని ఉపయోగిస్తారు.
18. కొన్ని రకాల పుట్టుమచ్చలను ఉల్లిరసం ఉపయోగించి సమర్ధవంతంగా తొలగించవచ్చు.
19. ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది.
20. ఉల్లిపాయ రసాన్ని తల మీద చర్మం మీద రాస్తే చుండ్రు మరియు జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

1/9 Pages

ఉల్లిపాయ: చర్మ ప్రయోజనాలు

ఉల్లిపాయలో యాంటి ఆక్సిడెంట్, విటమిన్లు ఏ, సి మరియు E సమృద్దిగా ఉండుట వలన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా ఉంచటంలో సహాయపడుతుంది. చర్మం మీద ఉల్లిపాయ రసాన్ని రాయటం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి.

యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు

ఉల్లిపాయలో యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు అపారంగా ఉన్నాయి. దీనిలో యాంటి ఆక్సిడెంట్, విటమిన్లు ఏ, సి మరియు E సమృద్దిగా ఉండుట వలన హానికరమైన UV కిరణాల వల్ల నష్టాన్ని నిరోదించుట మరియు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్ కుఎర్చెతిన్ అనేది ముడతలు రాకుండా నివారిస్తుంది. మరో వైపు విటమిన్లు మరియు సల్ఫర్ లు చర్మాన్ని మృదువుగా ఉంచటంలో సహాయపడతాయి. ఉల్లిపాయలో ఫైటోకెమికల్స్ సమృద్దిగా ఉండుట వలన యాంటీ ఏజింగ్ లో సహాయపడుతుంది.

English summary

Here are the benefits of onions. Follow these health tips you get healthy skin and silky hair. Onions are loaded with many chemicals that keep you away from illness and also make you glow due to their detoxification properties.