పుచ్చకాయలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Health benefits of Watermelon

02:58 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Health benefits of Watermelon

పుచ్చకాయ శరీరాన్ని నయం చేయటానికి అత్యంత శక్తివంతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. మెదడు నుంచి పాదాల వరకు అన్ని కణాలకు పుచ్చకాయ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.  పోషకాలు, విటమిన్ మరియు ఖనిజాలు సమృద్దిగా ఉన్న పుచ్చకాయ ఎక్కువగా వేసవిలో దొరుకుతుంది. పుచ్చకాయలో 90 శాతం నీటిని
కలిగి ఉంటుంది. అలాగే కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపరచటమే కాకుండా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు పుచ్చకాయలో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను తెల్సుకుందాం.

1/9 Pages

1. కార్దియోవాస్కులార్ మరియు ఎముకల ఆరోగ్యం

పుచ్చకాయలో ఉండే  లైకోపీన్ గుండె ఆరోగ్యానికి మరియు ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. పుచ్చకాయను ఎక్కువగా తీసుకోవటం వలన రక్తనాళాల వ్యాకోచమును పెంచి రక్త ప్రవాహాన్ని పెంచటం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాక లైకోపీన్ ఎముక మాతృ కణాలు మరియు ఎముక విచ్ఛిన్న కణాలకు కారణం అయిన  ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తుంది. సాదారణంగా  లైకోపీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలు ఎముకలకు బలాన్ని ఇస్తాయి. పుచ్చకాయలో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన, శరీరంలో కాల్షియం బాగా శోషణ జరిగేలా సహాయపడుతుంది.

English summary

Here are health benefits of watermelon. Watermelon cover everything from your brain all the way to the cells in your feet. Watermelon is incredibly hydrating and is naturally low-fat.