ఆస్తమా కోసం చిట్కాలు 

Health Remedies for Asthma

09:33 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Health Remedies for Asthma

అస్తమా అనేది శ్వాసకు ఇబ్బంది కలిగించే ఒక  ఊపిరితిత్తుల వ్యాధి. అస్తమా దీర్ఘ కాలికంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. ఊపిరితిత్తులలో గాలికి అవరోధం ఏర్పడినప్పుడు అస్తమా వస్తుంది. అస్తమా రావటానికి ఖచ్చితమైన కారణాలు లేవు. కానీ ఆహారం, కొన్ని రకాల మందులు అలెర్జీలు, వాయు కాలుష్యం, శ్వాసకోశ అంటువ్యాధులు, భావోద్వేగాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కారణం కావచ్చు. దగ్గు, శ్వాసలో గురక, శ్వాస ఆడకపోవుటం మరియు ఛాతీ బిగుతుగా ఉండటం వంటివి సాదారణ లక్షణాలుగా ఉంటాయి. అయితే కొన్ని ఇంటి నివారణల ద్వారా ఉపశమనం పొందవచ్చు.

1/11 Pages

1. అల్లం

అల్లం అనేది అస్తమాతో సహా అనేక వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. ఇది గాలి మార్గంలో సంకోచాలను నిరోదించటానికి మరియు మంట తగ్గటానికి సహాయం చేస్తుందని పరిశోదకులు కనుగొన్నారు.

* ఒక బౌల్ లో  అల్లం రసం, దానిమ్మ రసం మరియు తేనెలను సమాన పరిమాణంలో తీసుకోని కలపాలి. ఈ మిశ్రమాన్ని    ప్రతి రోజు రెండు స్పూన్లు తీసుకోవాలి.
* ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ అల్లం రసాన్ని కలిపి రాత్రి పడుకొనే సమయంలో త్రాగాలి.
* అల్లంను ముక్కలుగా కోసి వేడి నీటిలో వేసి ఐదు నిమిషాల తర్వాత త్రాగాలి.
* ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ మెంతులను వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ఒక స్పూన్ అల్లం రసం,ఒక స్పూన్ తేనే కలిపి ఉదయం,రాత్రి సమయాల్లో త్రాగాలి.
* అలాగే పచ్చి అల్లంతో ఉప్పు కలిపి కూడా తినవచ్చు.

English summary

Here are some health tips for Asthma. Asthma attacks occur when there is an obstruction in the flow of air in the lungs. The exact cause of this disease is not known but it can be triggered by allergies, air pollution.