అధిక బరువు లేదా ఊబకాయం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు

Health risks of being overweight

05:49 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Health risks of being overweight

అధిక బరువు మరియు ఊబకాయం అనే మాటలు ఈ మధ్య కాలంలో తరచుగా వినపడుతున్నాయి. వ్యాయామం మరియు శారీరక కార్యకలాపాల ద్వారా బర్న్ అయ్యే కేలరీల కన్నా ఎక్కువగా తినటం వలన ఊబకాయం వస్తుంది. ఒక మనిషి యొక్క శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఊబకాయంగా నిర్వచించవచ్చు. శరీర ద్రవ్యరాశి సూచిక (BMI) ను  ఒక వ్యక్తి యొక్క బరువు మరియు ఎత్తు ఆధారంగా లెక్కిస్తారు.  ఊబకాయం అనేది అనారోగ్యకరమైన ఆహారం, నిద్ర, జీవనశైలి, జన్యుశాస్త్రం, వయస్సు, గర్భధారణ మరియు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తుంది. అయితే ఈ ఊబకాయం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

1/11 Pages

1. టైప్ 2 డయాబెటిస్

రక్తంలో  గ్లూకోజ్ స్థాయిల నియంత్రణ,  ఇన్సులిన్ ఉత్పత్తి సామర్థ్యం లేకపోవటం కారణంగా  డయాబెటిస్ వస్తుంది. ఒక వ్యక్తి ఊబకాయం కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఊబకాయం మధుమేహం ప్రమాదాన్ని పెంచి, అకాల మరణం, రక్తనాళాలకు సంబంధించిన గుండె జబ్బులు, స్ట్రోకులు, మూత్రపిండాల వ్యాధి మరియు అంధత్వానికి కారణం అవుతుంది.

English summary

Here some of the reasons for obesity are an unhealthy diet, lack of sleep, inactive lifestyle, genetics, age, pregnancy and hormonal changes in the body.