ప్రతిరోజు తినవలసిన ఆహారం ??

Healthy food for every day

05:51 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Healthy food for every day

ప్రతిరోజు తినవలసిన ఆహారం ?? మహాబలం అన్నారు పెద్దలు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమై ఆహారాన్ని తినాలి. సమయానికి తిని, సమయానికి పడుకోవడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కొంత మంది సమయం సందర్బం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యతోపాటు వివిధ రకాల సమస్యలు తలెత్తుతాయి. అదే విధంగా సమయానికి తినాలి కదా అని ఏదిపడితే అది తినడం వల్ల కూడా ఆరోగ్యం మందగిస్తుంది. ప్రతిరోజూ తినడానికి సులభమైన ఆహారాలను ఎంచుకోండి. రోజూ ఒకేరకమైన ఆహారాన్ని సేవించడం కష్టంగానే ఉంటుంది. అందువల్ల ఈ ఆహారాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు తినడం మంచిది. ప్రతిరోజు తినదగ్గ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/12 Pages

1. బ్రోకలి

దీనిని రోజూ ఆహారంతో పాటుగా తీసుకోవచ్చు. దీనిని రోజూ క్రమం తప్పకుండా తినడం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది క్యాన్సర్‌ ని అద్బుతంగా ఎదుర్కొంటుంది. బ్రోకలీలో శక్తివంతంమైన సల్పర్‌ సమ్మేళనాలు ఉండడం వలన ఇది క్యాన్సర్‌ ని ఎదిరించడంలో సహాయపడుతుంది. ఈ సల్పర్‌ క్యాన్సర్‌ కారక ఏజెంట్స్‌ని నిర్వీర్యం చేయడంలో సహాయపడతాయి. ఇది రోజూ క్రమం తప్పకుండా తినడం వలన రొమ్ము, పెద్దపేగు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టి పని తీరును మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా కడుపులో క్యాన్సర్‌ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

English summary

For good health follow these steps. You can’t eat then regularly and hence you prefer eating them once or twice a week.