ఆరోగ్యకరమైన స్నాక్స్

Healthy snacks with low calories

08:00 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Healthy snacks with low calories

అందరూ ఆరోగ్యం గా ఉండాలనే ఆశపడతారు. కాని కొంతమంది సరైన పద్దతులను అనుసరించడం వల్ల వారు ఎంతో ఆరోగ్యం గా ఉంటారు. మరికొందరు ఏది ఎప్పుడు తినాలో తెలీక అనారోగ్యపాలయి బారీ శరీరాన్ని పొందుతారు. ఆరోగ్యకరమైన స్నాక్స్ తినడం వలన శరీర బరువును అరికట్టవచ్చు. ఈ ఆరోగ్యకరమైన స్నాక్స్ కేవలం 100 కేలరీల లోపే ఉంటాయి. అందువల్ల మీరు నిస్సందేహం గా ఈ స్నాక్స్ తినొచ్చు. స్నాక్స్ తినడం వల్ల మంచి లాబాలు ఉన్నాయి. ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండా సహాయపడుతుంది. అందువల్ల ఆరోగ్య కరమైన స్నాక్స్ తినడం వల్ల ఇంకా ఆరోగ్యం గా ఉంటారు. ఒక వేళ స్నాక్స్ కూడా ఎక్కువ కేలరీలు తీసుకోవడం వలన లాభం ఏం ఉంటుంది చెప్పండి.

1. పేలాలు

ఈ పేరు వింటే మనకి సినిమా హాల్ గుర్తొస్తుంది కదా... ఎక్కువ గా టైం పాస్ చేయడానికి, ఏమైనా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినడానికి వీటినే ప్రధానం గా ఎంచుకుంటాం. వీటిలో ఏ విధమైన కొవ్వు ఉండదు. ఇది స్నాక్స్ గా ఉదయం, సాయంత్రం ఎపుడైనా తీసుకోవచ్చు. ఒక కప్పు పేలాల లో 30 కేలరీలు కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తెసుకోవడం వలన ఎటువంటి ప్రమాదాలు ఉండవు.

2. వెజిటబుల్ చిప్స్

నునె లో వేపిన బంగాల దుంప చిప్స్ బదులు గా కేల్ అనే వెజిటబుల్ చిప్స్ తినడం చాలా మంచిది. దీనిలో విటమిన్ కె, ఎ, సి మరియు బి6 ఉంటాయి. వీటితో పాటు గా ఫైబర్, మాంగనీస్, కేపర్, కాల్షియం మరియు పొటాషియం ఉంటాయి. ఈ చిప్స్ ని తినడం వలన మెదడుకి మంచిది అంతే కాకుండా క్యాన్సర్ బారిన పడకుండా చూసుకుంటుంది. వ్యాది నిరోధక శక్తి పెంచి , ఎముకులను పటిష్టం చేస్తుంది. ఈ ఆకుకూర తో ఇంట్లోనే స్నాక్స్ ని తయారు చేసుకోవచ్చు.ఈ ఆకుకూరను ఆలివ్ నునె లో పెళ పెళ లాడెంత వరకు వేపి ఆ తరువాత స్నాక్స్ మాదిరిగా సేవించాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒక కప్పు చిప్స్ లో కేవలం 50 కేలరీలు కలిగి ఉంటుంది.

3. బేబీ క్యారెట్

ఇది ఒక అధ్బుతమైన స్నాక్ గా చెప్పవచ్చు. మీడియం సైజు క్యారెట్ లో 4 కేలరీలు మాత్రమే ఉంటాయి. సులభం గా 10 బేబీ క్యారెట్ ని తినవచ్చు. తక్కువ కేలరీలు కలగడం వలన దీని వల్ల ఎటువంటి దుష్ప్రబావాలు కలగవు. ఆరోగ్యానికి చాలా మంచిది క్యారెట్. దేనిలో విటమిన్ ఎ, బి6 మరియు సి వీటితో పాటు ఫైబర్, పోలేట్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ లు కలిగి ఉంటుంది. వీటిని తినడం వలన కళ్ళకు చాలా మంచిది . జీర్ణవ్యవస్థను, డయాబెటిస్ ని తగ్గిస్తుంది. అలాగే వ్యాది నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

4. ఆలివ్

మనకు ఆలివ్ ఆయిల్ యొక్క ఉపయోగాలు చాలా తెలుసు. అది ఆరోగ్యపరం గా చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే . ఆలివ్ పండ్లు కొంచం వగరు గా పచ్చని రంగులో ఉంటాయి. 20 ఆలివ్ కాయలలో దాదాపు గా 68 కేలరీలు ఉంటాయి. వీటిలో కాపర్ ,ఐరన్,ఫైబర్ మరియు విటమిన్ ఇ కలిగి ఉంటుంది. ఈ అలివ్స్ ఆర్దరైటిస్ , ఆస్తమా, మలబద్దకం మరియు వాపు ఇటు వంటి సమస్యలను తగ్గించడం లో సహాయపడుతుంది. అదే విధం గా గుండె కి సంబందించిన వ్యాదులను, రక్త పోటు , క్యాన్సర్ కారక కణాల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

5. ఆపిల్

రోజు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదు అని పెద్దలు అంటుంటారు .అది మోమ్మాటికి వాస్తవం. ఆపిల్ లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఒక ఆపిల్ లో 70 నుండి 80 వరకు కె;లారీలు ఉంటాయి రోజుకి ఒక ఆపిల్ స్నాక్స్ గా తినడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇందులో ఫైబర్ ఎక్కువ మోతాదు లో ఉంటుంది. అలాగే బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ సి ,ఐరన్,పొటాషియం ఫాస్పరస్ మరియు కాల్షియం ఉంటుంది. దీన్ని తినడం వలన డయాబెటిస్ , బరువు నియంత్రణ , ఎముకలు పటుత్వం పెంచుతుంది. అదే విధం గా దేన్నీ రోజు తినడం వలన పళ్ళు తెల్లగా అవుతాయి.

6. బాదం పప్పు

బాదం పప్పు తెలివితేటలను పెంచడం లో సహాయపడుతుంది . రోజుకు 12 నుండి 14 వరకు వీటిని తినాలి. బాదం పప్పు ని రాత్రి నాన పెట్టి మరుసటి రోజు ఉదయం తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.12 నుండి 14 బాదం పప్పులలో 90 నుండి 98 కేలరీలు మాత్రమే ఉంటాయి. వీటిలో బయోటిన్, ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్ ఇ మరియు బి2 , మాంగనీస్, కాపర్ ,ఫాస్పరస్ మరియు మెగ్నీషియం ఉంటుంది.వీటిని తినడం వలన గుండె కి మంచిది .ఇది చర్మాన్ని కాంతి వంతం గా చేయడం లో సహాయపడుతుంది.జ్ఞాపక శక్తి ని పెంచుతుంది.ఎముకులకు బలాన్ని ఇస్తుంది. వీటిని బాగా నమిలి తినాలి అప్పుడే బాగా జీర్ణం అవుతాయి.

English summary

Healthy snacks with low calories. You can eat a low calories, high-energy mid-morning and afternoon snack at the same time each day