శంకర్‌ మహదేవన్ కు గుండెపోటు

Heart Attack To Shankar MahaDevan

12:22 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Heart Attack To Shankar MahaDevan

ప్రముఖ సింగర్‌, గేయ రచయిత శంకర్‌ మహదేవన్‌ గుండెపోటుతో ఢిల్లీలోని ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు.48 ఏళ్ళ శంకర్‌ మహదేవన్‌కు రెండు సార్లు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రి కి తీసుకువెళ్ళి చికిత్సను అందిస్తున్నారు.

శంకర్‌ మహదేవన్‌ ఆరోగ్య సరిస్థితి గురించి వివరాలు తెలపడానికి ఆయన కుటుంబం నిరాకరించడంతో అందరిలోను తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే శంకర్‌ మహదేవన్‌ ఛాతిలో నొప్పితో ఆసుపత్రి లో చేరిన విషయాన్ని డాక్టర్లు ధృవీకరించారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నాడని, భయపడాల్సింది ఏమి లేదని వివరించారు. ఆయనకు గుండెపోటు రాలేదని తెలిపారు.

శంకర్‌ మహదేవన్‌ తనయుడు సిద్దార్ద్‌ మీడియాతో మాట్లాడుతూ అధిక శారీరక శ్రమ వల్లనే అలా అయ్యిందని చెప్పాడు. అనుమానం కలగడంతోనే యాంజియోగ్రామ్‌ చేసారని చెప్పారు.

ట్విట్టర్‌ లో మహదేవన్‌ స్పందిస్తూ నేను బాగానే ఉన్నాను, నా వారందరికి కృతజ్ఞతలు త్వరలోనే మీ ముందుకు వస్తానని ట్విట్‌ చేశాడు.

English summary

Famous singer and music composer Shankar Mahadevan suffered with heart attack on Sunday and admitted in Delhi hospital.