కంటతడి పెట్టిస్తున్న ఆ తల్లి తండ్రుల రోదన - షాకింగ్ న్యూస్

Heartbreaking news mother crying for her child

02:53 PM ON 2nd June, 2016 By Mirchi Vilas

Heartbreaking news mother crying for her child

ఇదో అంతుచిక్కని విషాదం ... ఒకరి కొడుకుని మరొకరు ఖననం చేసేసారు. తీరా అసలు తల్లిదండ్రులు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది.. పోలీసులు షాకయ్యారు.. ఆ తల్లి దండ్రుల ఆవేదన వర్ణనాతీతం ... ‘నా కొడుకు దిక్కులేనివాడిలా చనిపోయాడు. ఆచేదు నిజాన్ని మింగలేక గుండెలు బరువెక్కాయి. పాతిపెట్టేసిన మృతదేహాన్ని చూపిస్తే కళ్లారా కడసారి చూసి బరువు దింపుకుంటాం. మూడు రోజులుగా మృతదేహం కోసం తిరుగుతున్నాం. అయినా కనికరం కలగడం లేదా. మీ కాళ్లు పట్టుకుంటాం మహాప్రభో...మా అబ్బాయి మృతదేహం ఇప్పించండి’ అంటూ ఆ తల్లి దండ్రులు కాళ్ళా వేళ్ళా పడుతున్నారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన నక్క జనార్దన్ తల్లి కృష్ణవేణి, తండ్రి కొండయ్య బుధవారం పోలీసుల కాళ్లు పట్టుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. హృదయ విదారకమైన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే ..

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత గ్రామానికి చెందిన నక్క కొండయ్య, కృష్ణవేణిల చిన్నకుమారుడైన జనార్దన్ (17) పది రోజుల కిందట ఇంట్లో చిన్న గొడవపడి విశాఖ నగరానికి వచ్చేశాడు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద వుంటూ భిక్షాటన చేసుకునే వారితో కలిసి గడిపేసాడు. రోటరీ క్లబ్ కు చెందిన ప్రతినిధులు ఫ్లైఓవర్ కింద వుండే అనాధలకు రోజూ భోజనం సరఫరా చేస్తుండడంతో దానిని తిని, ఉదయం కాగానే నగరం అంతా తిరిగి, రాత్రికి మళ్లీ అక్కడికి చేరుకునేవాడు. ఈ నేపథ్యంలో గత నెల 28వ తేదీ రాత్రి ఫ్లైఓవర్పై నేవీ సిబ్బంది మద్యం మత్తులో కారును నడపడంతో జరిగిన ప్రమాదంలో జనార్దన్ మృతిచెందాడు. అయితే మృతిచెందిన జనార్దన్ కి తానే తండ్రినంటూ అప్పారావు అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు 30న శవపంచనామా చేసి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని అతనికి అప్పగించేసారు.

ఇక మృతదేహం తీసుకున్న అప్పారావు తాము నిరుపేదలమని చెప్పడంతో 'ప్రేమసమాజం' సేవా సంస్థ వారి సహాయంతో జ్ఞానాపురం శ్మశానవాటికలో పూడ్చిపెట్టారు. అయితే రోడ్డుప్రమాదంలో మృతిచెందిన జనార్దన్ తమ కుమారుడంటూ కొండయ్య, కృష్ణవేణి మే 31వ తేదీ తెల్లవారుజామున నగరానికి వచ్చారు. అన్ని ఆధారాలతో రెండో పట్టణ పోలీసులను సంప్రదించారు. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్తిన్నారు. తమ కుమారుడి మృతదేహాన్నైనా తమకు అప్పగిస్తే కడసారి ముఖం చూసుకుని సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేసుకుంటామంటూ పోలీసులను వేడుకున్నారు. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసేందుకు రెవన్యూ అధికారులకు, వైద్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

అయితే పోలీసులు వస్తే వైద్యులు రాకపోవడం.... వీరిద్దరూ వస్తే రెవెన్యూ అధికారులు రాకపోవడంతో మృతదేహం వెలికితీయడం కుదరడం లేదు. బుధవారం మధ్యాహ్నం మృతదేహన్ని వెలికితీయాలని అంతా నిర్ణయించుకోవడంతో ఏసీపీ నర్సింహమూర్తి, డిప్యూటీ తహసీల్ధార్ సుధాకర్ జ్ఞానాపురం శ్మశానవాటిక వద్దకు చేరుకున్నారు. వైద్యులు రావడం ఆలస్యం కావడంతో వెలుతురు సరిపోక మృతదేహాన్ని వెలికితీయడం ఆపేశారు. ఇక కొండమ్మ ఒక్కసారిగా రోదిస్తూ ఈరోజు కూడా తన కుమారుడి ముఖం చూసే భాగ్యంలేదా? అంటూ సమీపంలోవున్న ఎస్ఐ శ్రీనివాసరావు కాళ్లు పట్టుకుని రోదించింది. ఈ దృశ్యం చూసిన వారి హృదయాలు ద్రవించాయి. ఎంత కష్టం వచ్చి పడిందే అనుకోవడం వారి వంతయింది.

ఇది కూడా చూడండి:మెగా డాటర్ బిహేవియర్ పై అప్పుడే రూమర్స్?

ఇది కూడా చూడండి:అక్కడ ఎలుకలతో ఉన్న ప్రసాదాన్ని ఇస్తారట..

ఇది కూడా చూడండి:రూ. 3,500 కే విమానయానం - విద్యార్ధులకు బంపర్ ఆఫర్

English summary

Heartbreaking news mother crying for her child