కుబేరుడికి సైతం దిమ్మతిరిగే ఖరీదైన పెళ్లి...

Heavy budget wedding

11:48 AM ON 10th June, 2016 By Mirchi Vilas

Heavy budget wedding

ఈ భూమ్మీద ఎన్నో పెళ్ళిళ్ళు జరుగుతూ వుంటాయి. అందునా గొప్పింటి పెళ్ళిళ్ళ లో చేసే ఆర్భాటం అంతాఇంతా కాదు. డబ్బు మంచినీళ్ళ ప్రాయంలా ఖర్చు చేసేస్తారు. అయితే వాటన్నింటినీ తలదన్నే అతి ఖరీదైన పెళ్లి ఇది... మరి ఈ పెళ్లికయిన ఖర్చు చూస్తే, కుబేరుడికి సైతం దిమ్మతిరిగి పోతుంది. ఈ పెళ్ళిలో డబ్బును నీళ్లలా ఖర్చు పెట్టేశారు. జార్జియన్ బిలియనీర్ కొడుకైన 23 ఏళ్ల సర్గీస్ కారపెత్యేన్ కూ, సలోమి అనే ఇరవై ఐదేళ్ల వయసున్న అమ్మాయికి గత శనివారం మాస్కోలోని ఫేమస్ రెస్టారెంట్ సఫీసా వేదికగా అత్యంత విలాసవంతమైన ఈ పెళ్లి జరిగింది. కేవలం పెళ్లి వరకే అయిన ఖర్చు.. రెండు మిలియన్ డాలర్లు(13 కోట్ల రూపాయలు).

సిగ్గులొలుకుతూ పెళ్లి కూతురు ధరించిన మూడు వజ్రాలుపొదిగిన పెళ్లి గౌన్ల ఖరీదు రెండు లక్షల డాలర్లు...(1 కోటి 30 లక్షలు), ఇక ఈ పెళ్ళి బ్యాండ్ కు ఐదు నుంచి ఎనిమిది లక్షల డాలర్లు(5 కోట్ల 20 లక్షల రూపాయలు) ఖర్చయింది... మిరుమిట్లు గొలిపే లైటింగ్, వేల రకాల పూలు... పెళ్లి వేదిక చుట్టూ దంపతులిద్దరి ఫోటోలు.. వింత వెలుగులు విరజిమ్మే షాండ్లియర్స్. నమ్మబుధ్ధిగా లేదా? కానీ నమ్మితీరాల్సిందే. పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చేసిన పెళ్లి వేదిక పై పూలతో పోటీ పడి పెళ్ళి కూతురు మెరిసిపోయింది. ఇక ఈ మ్యారేజీకొచ్చిన అతిధులను ఎంటర్టైన్ చేసేందుకు మెరూన్ 5 టీమ్ కు సుమారు అయిదు నుంచి ఎనిమిది లక్షల డాలర్లు(5 కోట్ల 20 లక్షలు రూపాయలు) చెల్లించారు.

పెళ్లి సందర్భంగా నైన్ టైర్స్ సైజ్ వెడ్డింగ్ కేక్ కట్ చేశారు. ఇంతకీ ఈ పెళ్లి జరిపించిందేవరంటే, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కాకలు తీరిన తాషిర్ గ్రూప్ అధినేత శామ్ వెల్ కారపత్యేన్. పెళ్లి ఆర్భాటాలు ఒకసారి కింద స్లైడ్ షోలో చూడండి..

1/8 Pages

English summary

Heavy budget wedding