బ్రిటన్‌ లో వరద భీభత్సం

Heavy Floods In Britain

06:09 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Heavy Floods In Britain

బ్రిటన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఉత్తర బ్రిటన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు నగరాలు, పట్టణాలు జలమయమయ్యాయి. ఇప్పటి వరకు 300లకుపైగా వరద హెచ్చరికలను బ్రిటన్ అధికారులు జారీచేశారు. వేల మంది ప్రజలు తమ ఇండ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. యార్క్‌లోని హౌస్, ఫోస్ నదుల తీరప్రాంతాల్లో 400 వరకు ఇండ్లు ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. వరదలపై అత్యవసర కమిటీని ఏర్పాటు చేసినట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తెలిపారు. అత్యధిక వర్షపాతం నమోదుకావడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మేము ప్రజల కోసం అన్ని రకాల సహాయ చర్యలు చేపడుతున్నాం. గంటలో వారికి సహాయం అందుతున్నది అని కామెరాన్ చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని ఆయన భావిస్తున్నారు. చారిత్రక పర్యాటక ప్రాంతమైన యార్క్‌సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను రంగంలోకి దింపాలని ప్రధాని ఆదేశించారు.

English summary