అరగంటలో అల్లకల్లోలంలా భాగ్యనగరం

Heavy Rain In Hyderabad

10:16 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Heavy Rain In Hyderabad

అవును అప్పటిదాకా బానే వుంది...ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో వర్షం...ఒకే ఒక అరగంట ఎడతెరిపి లేని ఈదురుగాలులతో వర్షం....ఆ సమయంలోనే భాగ్యనగరం అల్లాడిపోయింది. శుక్రవారం సాయంత్రం గాలిదుమారం, భారీవర్షం నగరాన్ని అతలాకుతలం చేశాయి. నేలకొరిగిన వృక్షాలు, ఒరిగిన విద్యుత్‌ స్తంభాలు, కూలిన హోర్డింగ్‌లు, చిరిగిన ఫ్లెక్సీలు... అరగంట విధ్వంసం తర్వాత నగరంలోని అనేక ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే, ఇలా అయిందా అనిపించేలా తయ్యారయింది.

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ కి సూపర్ స్టార్ కితాబు

సాధారణ వర్షానికే నగరంలోని రోడ్లు జలమయం కావడం చూస్తూనే ఉంటాం. కానీ శుక్రవారం సాయంత్రం వరుణుడికి వాయువు తోడై భాగ్యనగరాన్ని వణికించారు. రోడ్లపై నుంచి వర్షపు నీరు పొంగి ప్రవహించగా... చెట్లు, విద్యుత్‌ స్తంభాలు రహదారులపై పడి తుపాను విధ్వంసాన్ని తలపించాయి. ఈ ప్రకృతి ప్రకోపంతో నగరంలోని ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి వాహనాలు కదలక వాహనదారులు నరకయాతన అనుభవించారు. జీహెచ్‌ఎంసీ, పోలీసు విభాగాలు వాహన రాకపోకలను పునరుద్ధరించేందుకు సహాయచర్యలు చేపట్టారు. నగర మేయర్‌ సైతం సహాయచర్యల్లో పాల్గొన్నారు.

జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షానికి ఈదురుగాలులు తోడు కావడంతో పలు ప్రాంతాల్లో భారీవృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

క్యుములోనింబస్‌ మేఘాల కారణంగానే హైదరాబాద్‌లో వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘రోను’ తుపాను నగరంపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని స్పష్టం చేసింది. అకస్మాత్తుగా ప్రారంభమైన వర్షంలో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులకు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టుకు వెళ్లే మార్గంలో ఓ భారీ హోర్డింగ్‌ విరిగిపడి 8కార్లు ధ్వంసమయ్యాయి.

ఇవి కూడా చదవండి:చూపులతో100కోట్లు కొల్లగొట్టిన14 ఏళ్ళ అమ్మాయి(వీడియో)

ఇవి కూడా చదవండి:ప్రిన్స్ కి సూపర్ స్టార్ కితాబు

English summary

Heavy Rain in Hyderabad Killed Three People and many of the trees were fallen down. A Big Hording in Hyderabad fallen down and damages 8 Cars in the city.