తిరుమలలో వర్షం ... వర్షం ...

Heavy Rain In Tirumala

11:51 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Heavy Rain In Tirumala

దేశంలోని వివిధ ప్రాంతాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా తిరుమలలో భారీ వర్షం కురిసింది. బుధవారం వేకువజాము నుంచి కుండపోతగా కురిసిన వర్షంతో శ్రీవారి భక్తులు అవస్థలు పడ్డారు. భారీ వర్షంతో రహదారులు, ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. వేకువజామున అర్చన, తోమాల సేవలకు హాజరయ్యే భక్తులు వర్షంలో తడుస్తూనే వైకుంఠంకు చేరుకోవాల్సి వచ్చింది. కొందరు భక్తులు సేవ మొదలయ్యే సమయానికి ఆలయానికి చేరుకోలేకపోయారు. కనుమదారుల్లో కూడా వర్షం కురుస్తుండటంతో వాహనదారులకు భద్రతా సిబ్బంది సూచనలు చేశారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ద్విచక్రవాహనాలకు కొంత సమయం కనుమదారుల్లో అనుమతి నిలిపివేశారు.

1/4 Pages

English summary

Heavy Rain In Tirumala thirupathi.