అల్పపీడనం ..... వర్షం .... వర్షం ....

Heavy Rains In AP,Tamilnadu

10:29 AM ON 30th November, 2015 By Mirchi Vilas

Heavy Rains In AP,Tamilnadu

మళ్ళీ అల్పపీడనం ..... వర్షాలే వర్షాలు ... ఆగ్నేయంగా బంగాళాఖాతం లో కొనసాగుతున్న అల్పపీడనం... దాని అనుబంధంగా ఆవర్తనం .... మరోపక్క నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం దీంతో దక్షిణ కోస్తాలో, , రాయలసీమలో తమిళనాడులో వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వర్షాలతో అతలాకుతలం అయిన ప్రాంతాలలోనే మళ్ళీ వర్షాలు పడుతుండడంతో మరింత ఇబ్బంది ఏర్పడింది. తమిళనాడు లో పలు ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా 6జిల్లాల్లో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. ఇక ఎపిలో చిత్తూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తిరుమల కొండమీద , తురుపతిలో కూడా తెల్లవారుఘాము నుంచి వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసారు. పరిష్టితిని అధికారులు పరిశీలిస్తున్నారు. స్కూళ్ళకు సెలవులు ప్రకటించారు. నిన్న సాయంత్రం నుంచి వర్షం పడుతుండగా మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో చెర్వులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

శ్రీకాళహస్తిలో జోరుగా పడుతున్న వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే కార్తిక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఇక తిరుమలలో కురుస్తున్న వర్షాలకు భక్తుల సంఖ్య కూడా తగ్గింది. గత 15రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనం రద్దీ తగ్గి సులువుగా దర్శనం అవుతోంది. సాధారణ దర్శనానికి 3గంటల సమయం పడుతుంటే , నడకదారిన వెళ్ళే వాళ్లకు రెండు గంటల సమయం పడుతోంది. అసలు కార్తిక మాసంలో భక్తులు పోటెత్తడం రివాజు. కానీ వర్షాల ప్రభావం రద్దీని తగ్గించింది. తిరుమల దర్శనానికి స్వల్ప సమయం పడుతుండడం తో వెళ్ళిన భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English summary

The weather office says there were heavy rains to Andhrapradesh,Tamil Nadu, Puduchery.Due to this the famous temples like Tirupathi,Sri Kalahasthi temples are less cowded