భాగ్యనగరాన్ని చిత్తడి చేసిన వానలు(వీడియో)

Heavy rains in Hyderabad

01:18 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Heavy rains in Hyderabad

ప్రస్తుతం వరుసగా కురుస్తోన్న కుండపోత వానలు భాగ్యనగరాన్ని ముంచెత్తాయి. ఇంకా వర్షాలు కొనసాగితే ఎలాగరా భగవంతుడా అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. గడచిన పది రోజుల్లో భారీవర్షాలు నగరాన్నినీట ముంచడం ఇది మూడోసారి. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు 108 ఏళ్ల నాటి రికార్డులు సైతం బద్దలయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో ఇప్పుడు అత్యధిక వర్షపాతం నమోదైంది. 1908లో అత్యధికంగా 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే, ఈరోజు 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో పాత రికార్డు చెరిగిపోయింది.

1/7 Pages

పరిస్థితి అస్తవ్యస్తం..


ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిన కురుస్తోన్న వర్షాలకు నగరంలోని కాలనీలు, బస్తీలన్న తేడా లేకుండా నగరవాసుల జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రోడ్లు గుంతలు పడ్డంతోపాటు, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తమై, ట్రాఫిక్ జామ్ లతో నగరజీవనం నరక ప్రాయంగా మరిపోయింది. ఇళ్లల్లోకి సైతం నీరు చేరి, కరెంట్ లేక నాలాలు రాక హైదరాబాదీలు అతలాకుతలమయ్యారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారు. వర్షం నీరు, మురుగు నీరు ఏకమై ప్రవహిస్తుండడంతో కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి వీల్లేకుండా వుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపడుతున్నారు.

English summary

Heavy rains in Hyderabad