రాయలసీమను ముంచెత్తిన వర్షాలు

Heavy Rains in Rayalasema

02:34 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Heavy Rains in Rayalasema

వర్షాభావ పరిస్టితుల ను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. నదులు, వాగులు , వంకలు , జలాశయాలు నిండిపోయి , పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో ఎడతెరపిలేని వర్షం పడుతోంది. చిత్తూరు, కడప, వర్షం భీభత్సం చేస్తోంది. , వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తిరుమలలో ఎడతెరపిలేని వర్షం కారణంగా కొండచరియలు విరిగి పడుతూనే ఉన్నాయి. దీంతో మరమ్మత్తు పనులకు ఆటంకం కలుగుతోంది. రెండో ఘాట్‌రోడ్డులో 16వ కిలోమీటర్ వద్ద రోడ్డు కుంగిపోయే స్థితిలో ఉండటంతో లింకురోడ్డు ద్వారా వాహనాలు కొండపైకి మళ్లించారు.

ఎడతెరపిలేని వర్షం వల్ల తిరుమలలో భక్తుల రద్దీ కూడా తగ్గింది. మరోవైపు తిరుమల జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కుమారధార, పసుపుధార,పాపవినాశనం,గోగర్భం, ఆకాశగంగ జలాశయాలు కళకళలాడుతున్నాయి. వరదధాటికి పాపవినాశనం డ్యాం గేట్లు ఎత్తివేశారు. చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షానికి శ్రీకాళహస్తిలో స్వర్ణముఖినది ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళంగి రిజర్వాయర్ నిండుకుండలా ఉంది. వరద ఉధృతికి నాలుగు గేట్లు ఎత్తివేయగా ఓ గేటు కొట్టుకుపోయింది. చెరువులు పూర్తిగా నిండిపోవడంతో తొట్టంబేడు మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఆలయంలోకి కూడా వర్షపు నీరు చేరుతోంది. కడప జిల్లాలో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రైల్వే కోడూరులో గుంజలేరు, ముస్తేరు, మేకలగుంతేరు నదులు పొంగిపొర్లుతున్నాయి. వాగేటికోన, చాకరేవుకోన రిజర్వేయర్లు నిండాయి. వరద ఉధృతి పెరిగితే వాగేటికోన, చాకరేవుకోన ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు చర్యలకు సమాయత్తమయ్యారు.

ఇక నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా బోగోలు, అల్లూరు, దగదత్తి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. చెన్నూరులో పైడేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాయుడిపేటలో వీధులు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో ఉన్న వట్రపాలెం వాసులకు అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గూడూరు డివిజన్‌లో కైవళ్యా నది పొంగిపొర్లుతోంది. ఎడతెరపిలేని వర్షం కారణంగా జిల్లాల్లో విద్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది..

English summary

Heavy Rains in Rayalasema.Due to heavy rains in Tirupathi people suffers a lot