రోడ్డెక్కిన బాహుబలి ...

Heavy vehicle with 320 wheels which is travels on National Highway

12:36 PM ON 20th June, 2016 By Mirchi Vilas

Heavy vehicle with 320 wheels which is travels on National Highway

అవును ఇది బాహుబలి శకం. ఎందుకంటే, బాహుబలి సినిమా సృష్టించిన ఫీవర్ అలాంటిది మరి. ఇక బాహుబలి -2కూడా రెడీ అవుతున్నదుంద ఈ ఫీవర్ కూడా కంటిన్యూ అవుతోంది. మరి మనం చెప్పే బాహుబలి మనిషి గురించి కాదు వాహనం గురించి .. 5వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం 320 చక్రాల భారీ వాహనం పెద్ద యంత్ర పరికరాలతో కనిపించడంతో జనం దృష్టి దానిపైకి మళ్లింది. కోల్ కతా నుంచి చెన్నై వెళ్తున్న ఈ 320 చక్రాల భారీ వాహనానికి వెనుక ఏర్పాటు చేసిన మరో మెగా ట్రాలీ సాయంతో తోసుకుంటూ వెళ్లారు. జాతీయ రహదారి అంతా సరిపడే విధంగా వెడల్పు, విద్యుత్తు వైర్లు తగిలే స్థాయిలో ఎత్తు ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరో నాలుగు వాహనాల్లో సిబ్బంది రక్షణ చర్యలు తీసుకుంటూ వాహనాన్ని తీసుకువెళ్లారు. వాహనానికి చుట్టూ సుమారు 50 మంది రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాహనం వెళ్లే మార్గంలో ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించింది. దీనిని సరిచేయడానికి వెనుక జాతీయ రహదారుల నిర్వహణ వాహనాలూ తరలివెళ్లాయి. ముందెన్నడూ ఈ మార్గంలో ప్రయాణించని స్థాయిలో ఉన్న వాహనం, పైన భారీ యంత్ర సామగ్రి ఉండటంతో జాతీయ రహదారి మీదుగా వెళ్లే వారంతా ఆశ్చర్యంగా దీనిని తిలకించారు. అయితే వాహనం వెనుక వెళ్లే వాహనాల వారు మాత్రం తప్పించడానికి అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు. ఈ భారీ వాహనాన్ని అక్కడక్కడ పక్కకు నిలిపి మిగిలిన వాహనాలకు దారి ఇవ్వడంతో వారంతా తప్పించుకు వెళ్లారు. మొత్తానికి చెన్నై వెళ్ళేలోపు ఎందరినో ఈ బాహుబలి బండి ఆశ్చర్య పరచనుంది.

ఇది కూడా చూడండి: ఈ పాత్రలకు వన్నె తెచ్చిన ఎన్టీఆర్

ఇది కూడా చూడండి: భూగర్భంలో అంతుచిక్కని మిస్టరీలు

ఇది కూడా చూడండి: అమ్మాయిలు... ఈ ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్ ట్రై చేసారా?

English summary

Heavy vehicle with 320 wheels which is travels National Highway on Sunday.