ఈ కుమారీకి ఒక్క బ్రేక్ ప్లీజ్

Hebah Patel asking for chances in tollywood movies

10:30 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Hebah Patel asking for chances in tollywood movies

ఒక్కోసారి అదేంటో కానీ.. కొన్ని విచిత్రంగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. అదే రీతిలో కొంతమంది ఎంత కష్టపడి ఎంత గుర్తింపు తెచ్చుకున్నా కూడా.. వారికి పెద్దగా ఛాన్సులు రావు. బాలీవుడ్ లో ఏకంగా రెండు నేషనల్ అవార్డులను కొట్టేసిన కంగనా రనౌత్ పరిస్థితి అలాగే తయారయింది. ఎవరూ కూడా పెద్ద సినిమాలను ఆఫర్ చేయట్లేదు. కేవలం ఆమెతో చిన్నచిన్న డైరక్టర్లే పెద్ద హిట్లు కొట్టి అవార్డులు తెచ్చిపెడుతున్నారు. మరీ అంత రేంజ్ కాకపోయినా.. ఇప్పుడు టాపిక్ మాత్రం అలాంటి ఓ హీరోయిన్ గురించే. మన దగ్గర ఒకప్పుడు తాప్సీ వంటి బ్యూటీలు ఉన్నారు.

ఛాన్సులు బోలెడన్ని వచ్చినా కూడా ఆ భామ ఎందుకో ప్రూవ్ చేసుకోలేకపోయింది. చివరకు టాలీవుడ్ లో ఇంతే అంటూ తిట్టేసుకుని అమ్మడు బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది. ఆ కధ అలా ఉంచితే, ఇక కుమారి 21ఎఫ్ సినిమాతో పాపులర్ అయిన హెబా పటేల్ ను తీసుకోండి. ఆ సినిమా ఆడటానికి ఆమే కారణం అన్నారు. పాప దగ్గర బోలెడంత గ్లామర్ సైతం ఉంది. నిన్నటికి నిన్న ఫిలింఫేర్ అవార్డుల ఉత్సవాల్లో కూడా.. తన గ్లామరస్ లుక్ తో ఊపుతెచ్చింది అయినా ఏం లాభం లేదు. ఆమె చేతిలో పెద్దగా ఛాన్సులు లేవు. కేవలం మిష్టర్ సినిమా మీదనే ఆశలు పెట్టుకుంది హెబా.

ఎందుకంటే నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలోనూ అమ్మడు సెకండ్ హీరోయినే.. ఇప్పుడు మిష్టర్ సినిమాలోనూ అంతే. కాకపోతే వరుణ్ తేజ్ సరసన మెగా మూవీలో చేస్తే.. రీచ్ ఎక్కువుంటుందని ఆమె నమ్మకం. ఇదండీ వరస. టాలెంట్ వున్నా కాలం కల్సి రాకపోతే ఇక ఇలానే ఉంటుంది మరి.

English summary

Hebah Patel asking for chances in tollywood movies