బెల్లీ డాన్సర్ గా మారిపోయిన కుమారి!

Hebah Patel is acting as a belly dancer in new movie

05:10 PM ON 21st July, 2016 By Mirchi Vilas

Hebah Patel is acting as a belly dancer in new movie

'కుమారి 21ఎఫ్' సినిమాతో టాలీవుడ్ కుర్రకారునే కాదు సినీ జనాన్ని తన వైపు తిప్పుకున్న హెబ్బా పటేల్ ఇప్పుడు బెల్లీ డాన్సర్ గా మారిపోయిందట. సినిమాల్లో అవకాశాలు రాకపోతే వేరే రంగంలోకి మారిపోతారు కొంతమంది హీరోయిన్లు. అయితే హెబ్బా పటేల్ మాత్రం ఛాన్స్ లున్నా కానీ బెల్లీడాన్సర్ గా మారిపోయిందట. ఏంటీ ఇదంతా నిజమే అనుకున్నారా? కాదండీ బాబు.. సినిమా కోసం అమ్మడు ఆ అవతారం ఎత్తిందట. ఆనంద్ డైరక్షన్ లో నిఖిల్ హీరోగా తెరకెక్కే 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో బెల్లీడాన్సర్ పాత్రలో హెబ్బా కనిపించనుందట. అందుకే ఓ నెలరోజులుగా హెబ్బా ఆ డాన్స్ ని, వాళ్ల తీరు, హావభావాలను తెలుసుకుంటోందని ఫిలిం నగర్ టాక్. అదండీ సంగతి.

English summary

Hebah Patel is acting as a belly dancer in new movie