'కుమారి 'కి భలే డిమాండ్‌

Hebha Patel Has Great Demand In Tollywood

06:49 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Hebha Patel Has Great Demand In Tollywood

ఒక్కసారిగా అదృష్టం తలుపు తడితే ఇంక వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అంటారు.సరిగ్గా 'కుమారి 21 ఎఫ్‌' హీరోయిన్‌ హేబాపటేల్‌ విషయంలోను అదే జరిగింది. ఇంతకు ముందు హేబాపటేల్‌ 'అలాఏలా' చిత్రంలో నటించింది.ఐతే ఆ సినిమా ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కాగా ఇటీవల హేబాపటేల్‌ హీరోయాన్‌గా నటించిన 'కుమారి 21ఎఫ్‌' చిత్రం అఖండ విజయం సాధించడంతో హేబాపటేల్‌ కు ఆఫర్లు వెల్లువగా వహిస్తున్నాయి. పెద్దపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలు కూడా హేబాపటేల్‌ కోసం పోటీపడుతున్నాయి. ఇప్పటికే మరో రెండు చిత్రాలకు ఒకే చెప్పింది హెబాపటేల్‌ ఇందులో ఒక స్టార్‌హీరో సినిమా కూడా ఉన్నట్టు సమాచారం, మొత్తానికి కుమారి 21 ఎఫ్‌ తో హేబా పటేల్‌ కు అదృష్టం వరించిందనే చెప్పాలి.

English summary

Hebha Patel who acted as a heroine in "Kumari 21F" has a great demand on tollywood. Her recent movie was a hit at the box office. Some of the satr prodecers are waiting for her call sheets.Pesently Hebha patel comitted for two films. She is also acting in on e of the star hero film