ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయిన'కుమారి'

Heebah Patel got 30 thousand likes in facebook

01:53 PM ON 26th November, 2015 By Mirchi Vilas

Heebah Patel got 30 thousand likes in facebook

'అలాఎలా' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఢిల్లీ భామ హెబ్బాపటేల్‌. ఈ చిత్రంలో సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించిన ఈ భామ ఆడియన్స్ని అంతగా ఆకర్షించలేకపోయింది. ఈ చిత్రంతోనే తన కెరీర్‌ ముగిసిపోయింది అనుకుంది. అయితే అనుకోకుండా సుకుమార్‌ నుండి పిలుపు వచ్చింది. అదే 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం. సుకుమార్‌ వంటి పెద్ద డైరెక్టర్‌ నుండి ఛాన్స్‌ రావడంతో హెబ్బా ఆనందానికి హద్దులు లేవు. ఇటీవలే ఈ చిత్రం రిలీజై సూపర్‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో హెబ్బా ఎక్స్‌పోజింగ్‌ విషయంలో హద్దులు దాటిన తన నటనకి యూత్‌ నుండి మంచి మార్కులే పడ్డాయి.

ఒకప్పుడు ఈమెని సోషల్‌ మీడియాలో పట్టించుకోని జనం కుమారి తర్వాత ఈమె పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఒక రేంజ్లో నటించిందని కితాబులు ఇస్తున్నారు. ఫేస్‌బుక్‌లో హెబ్బా ప్రొఫైల్‌ పేజ్‌కు ఒకేసారి 30 వేల లైక్స్‌ వచ్చాయి. ఆ ఫాలోయింగ్‌ చూసి ఇది కలా నిజమా అంటూ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత తన ప్రతీ మూమెంట్‌ని ఫేస్‌బుక్లో అప్‌డేట్ చేస్తుంది. కుమారితో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయింది హెబ్బాపటేల్‌.

English summary

Heebah Patel got 30 thousand likes in facebook. She acted in Kumari 21f movie which was got super hit talk recently.