రియో ఒలింపిక్స్‌కు హీనా సిద్ధూ 

Heena Sidhu Selects For Rio Olympics

10:11 AM ON 28th January, 2016 By Mirchi Vilas

Heena Sidhu Selects For Rio Olympics

భారత స్టార్ మహిళా షూటర్‌ హీనా సిద్ధూ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఇటీవల కువైట్‌లో జరిగిన ఆసియా షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇదే విభాగంలో ఆమె స్వర్ణం కైవసం చేసుకుంది. గత రెండు ఒలింపిక్స్‌లో భారత షూటర్లు తమ సత్తా చాటిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటర్లు అభినవ్‌ బింద్రా, గగన్‌ నారంగ్‌, జితు రాయ్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఇదే దూకుడు కొనసాగిస్తే.. రియో ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంది.

English summary

Indian Women Shooter Heena Sidhu selects for Rio Olympics. Heena Sidhu Selects 10 Meters Air Pistol Categeory.Recently She won Gold Medal In Asia Shooting champion ship which was conducted in Kuwait. Shooters Jeetu Roy,Abhinav Bindra,Gagan Narang were already had been selected for Rio Olympics