హలో బ్రదర్స్ ని తలపించే హలో సిస్టర్స్ రియల్ స్టోరీ

Hello sisters real story

10:55 AM ON 9th July, 2016 By Mirchi Vilas

Hello sisters real story

ఆ మధ్యన టాలీవుడ్ మన్మధుడు యాక్ట్ చేసిన హలో బ్రదర్స్ సినిమా అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. దివంగత దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన హలో బ్రదర్స్ మాంచి హిట్ కొట్టింది. హీరోలు కవలలు కావటం. వారిద్దరూ వేర్వేరు చోట్ల ఉన్నా, ఒకరు చేసిన పనే, మరొకరు అప్రయత్నంగా చేయటం వంటివి హలో బ్రదర్స్ మూవీలో చూసే వుంటారు. అయితే ఇలాంటివి రీల్ లైఫ్ లోనే కానీ రియల్ లైఫ్ లో ఉండవని సెటైర్లు వేయడం కూడా జరిగింది. కానీ, రీల్ లైఫ్ కు తగ్గట్లే రియల్ లైఫ్ లోనూ ఇదే తరహాలో 'హలో సిస్టర్స్' ఉదంతం ఒకటి ఇటీవల వెలుగు చూసింది.

హలో సిస్టర్స్ గురించి వింటే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. అమెరికాకు చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ మన హలో బ్రదర్స్ సినిమాలో మాదిరే వీరి యవ్వారం ఉంటుంది. కవలలు అయిన వీరికి జీవితంలో చాలా సందర్భాల్లో ఒకేలాంటి అనుభవాలు ఎదురు అయ్యాయట. ప్రస్తుతం 35 ఏల్ల సారా మేరియజ్, లే రోజర్స్, కవలలుగా పుట్టారు. పుట్టినప్పుడు ఎలా అయితే జంటగా ఉన్నారో.. పెరిగే సమయంలోనూ ఇద్దరి మధ్య అంతే అనురాగం ఉండేది. వేసుకునే దుస్తులు మొదలు, ఆడుకునే బొమ్మల వరకూ అన్ని సేమ్ టు సేమ్. చాలామంది కవలల విషయంలో ఇలాంటివి కామన్.

కానీ, వీరి విషయంలో అంతకు మించి, అన్న వ్యవహారం ఉంది. అదేమంటే, వీరిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. వేర్వేరుప్రాంతాల్లో ఉంటున్న వీరు అనూహ్యంగా ఒకేసారి గర్భం దాల్చారు. వీరిని పరీక్షించిన డాక్టర్లు, రోజర్స్ కంటే నాలుగు రోజుల ముందే మేరియజ్ డెలివరీ అవుతుందని చెప్పారు. సరే అనుకున్నప్పటికీ, విస్మయకరంగా వీరిద్దరి డెలివరీలు ఒకే సమయంలో జరగటంతో వారిద్దరూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రియల్ లైఫ్ లో ఇలాంటివి చిత్రంగానే వుంటాయని చెప్పాలి.

English summary

Hello sisters real story