కాలుష్యం నుంచి కాపాడే.. హెల్ప్ చాట్

Helpchat App Provides Air Quality Updates

05:27 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Helpchat App Provides Air Quality Updates

కాలుష్యం.. కాలుష్యం.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఇదే అంశం. రోజురోజుకూ పొల్యూసన్ పెరిగిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాతావరణ కాలుష్యం కారణంగా ఆరోగ్యం పాడవుతోంది. ఇది అనేక చెడు పరిణామాలకు దారితీస్తోంది. దీంతో కాలుష్యం నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు కూడా నడుంకట్టాయి. ఇటీవల ఢిల్లీలో సరి-బేసి ఫార్మూలా ఇలాంటిదే. అయితే ప్రజలు తమకు తామే కాలుష్యాన్ని కంట్రోల్ చేసేందుకు సరికొత్త యాప్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. అదే 'హెల్ప్ చాట్. దీని సహాయంతో వాయు కాలుష్యం నాణ్యత, స్థాయిలను తెలుసుకోవచ్చు. పొల్యూషన్ నుంచి విముక్తిని పొందేందుకు ఈ హెల్ప్ చాట్ ఎంతగానో ఉపయోగ పడుతుంది. తమ పరిసరాల్లోని వాతావరణంలో గాలి నాణ్యతను పరిశీలించే సామర్థ్యాన్నిఈ యాప్ కలిగి ఉంది. యూజర్లు ఒకవేళ విషపూరితమైన శ్వాసను పీలుస్తుంటే... ఈ యాప్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తుంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ద్వారా 0 (జీరో) నుంచి 500 దాకా వాయు నాణ్యతను గుర్తిస్తుంది. అంటే కాలుష్యం పూర్తిగా లేనప్పుడు జీరో నుంచి అత్యంత కాలుష్య పూరిత మైన గాలి ఉన్నపుడు 500 వరకూ నాణ్యతను ఈ యాప్ తెలుపుతుంది. అంతేకాదు గాలి నాణ్యతను బట్టి వినియోగదారుల స్మార్ట్ ఫోన్ కు ముందు జాగ్రత్త హెచ్చరికను కూడా పంపుతుంది. అలాగే నగరాల్లో పొల్యూషన్ ఉన్న ప్రాంతాలను, నష్టాన్ని కలిగించే ప్రాంతాలను ఈ యాప్ సూచిస్తుంది. ఊపిరితిత్తులకు నష్టం కలిగించే, అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే కొన్ని కెమికల్స్ ను కూడా ఇందులోని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సూచిక గుర్తిస్తుంది. స్థానిక వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేసి, సరైన సమయంలో వినియోగదారులకు అందిస్తుంది. ఈ హెల్ప్ చాట్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

English summary

Bengaluru-based personal assistant app Helpchat has launched a new feature on its app that provides alerts ­when the air quality was low