హేమ రూటే వేరు.. ఇక కోర్కెలూ డిఫరెంటే..

Hema want to police and don characters

11:51 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Hema want to police and don characters

వచ్చిన కొత్తలో కాస్త బిడియంగా వున్నా, ఇండస్ట్రీలో రాణించాలంటే ఎలా ఉండాలో అంతే హుషారుగా వుంటూ, తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నలేడీ యాక్టర్స్ లో ప్రధానంగా చెప్పే పేర్లలో హేమ ఒకరు. ఇప్పటి వరకు వదిన, అక్క, భార్య క్యారెక్టర్లతో మెప్పించిన హేమ ఇక విభిన్న క్యారెక్టర్లు చేసేందుకు రెడీ అంటోంది. ఇప్పటికే కుమారి 21ఎఫ్ లో హీరో తల్లిగా చేసిన ఈమె దర్శకులు తనను దృష్టిలో ఉంచుకుని కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేస్తే చేయడానికి తనకు ఏ అభ్యంతరం లేదని అంటోంది. తన పర్సనాలిటీ లేడీ డాన్, పోలీసు పాత్రలకు సరిపోతుందని ఇన్ డైరెక్ట్ గా దర్శకులకు హింట్ ఇచ్చింది హేమ.

లేడీ ఓరియెంటెడ్ పాత్రలు టాలీవుడ్ లో అరుదుగా వస్తున్న క్రమంలో హేమ కోరిక ఎలా తీరుతుందని మూవీ సర్కిల్ లో జోరుగానే చర్చించుకుంటున్నారు. డాన్, పోలీసు పాత్రలు అంటే ఫైట్ లు అవీ చాలానే చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి విజయశాంతి, మాలాశ్రీ లాంటి కొంతమంది హీరోయిన్లకే సాధ్యమయ్యాయి. అవన్నీ తెలిసి కూడా ఇలా కామెంట్ చేసిందంటే హేమ మరో విజయశాంతి కావాలని కలలు కంటోందా అని టాలీవుడ్ లో ఒకటే గుసగుసలు. మరి హేమ కోరిక నెరవేరుతుందా లేదా అనేది చూడాలి.

English summary

Hema want to police and don characters