కోడిపుంజులను సైతం ఆన్‌లైన్లో...

Hens Selling On Online Sites 

04:46 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Hens Selling On Online Sites 

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందాలు. చిన్నపిల్లల నుండి పండు ముసలివాళ్ళ వరకు కోడి పందాలు ఎక్కడ జరిగినా అక్కడ వాలిపోతుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సంప్రదాయం కనిపిస్తుంటుంది. కోడి పందాలు పై నిషేదం ఉన్నప్పటికీ ఏదో ఒక మూల కోడి పందాలు జరుగుతూనే ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రిత్యా పట్టణాల్లో నివసించేవారు కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తమ ఊళ్ళో వాలిపోతుంటారు. సంక్రాంతి పండుగకు అంత ప్రాధాన్యమన్న కోడిపందాల కోసం కోడి పుంజులను సైతం ఆన్‌లైన్‌లో అమ్మేస్తున్నారు. ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా కోడిపందాలకు కోళ్ళను నేరుగా ఆన్‌లైన్లో పెట్టి విక్రయిస్తున్నారు. ఒక్కోకోడి పుంజు ధర 1000 రూపాయలు నుండి మొదలుకోని 1,00,000 రూపాయల వరకు లభిస్తున్నాయి. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని పందెం పుంజులకు గల డిమాండ్‌ ను సొమ్ము చేసుకోవడానికి ఇంటర్నెట్‌ ను వాడేస్తున్నారు. దీని కోసం వివిధ వెబ్‌సైట్లలో కోడి పుంజులను ఫోటోలతో పాటు ఆ కోడికి గురించిన సమాచారం వంటివి అన్నీ పెడుతూ వారి వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. మొత్తానికి సంక్రాంతి పండుగ పుణ్యమా అని కోడి పుంజుల వ్యాపారం మూడ పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి !!!

పసి పిల్లల ఏడుపును ఆపే ట్రిక్‌

అలాంటి దేశం ఉంటుందా

వెస్ట్ లైఫ్ అంత బెస్ట్ కాదురా మామా...!!!!!

తమన్నా అందాలకి 1.5 కోట్లు!!

English summary

Sankranthi its a big festival for andhra pradesh. We know its a time for hens fighting. People crazy about betting for this fight and lakhs to crores ruppes betting happens for this fight. As the time near, some people seling hens online.