'సునీల్‌' తో నటించనన్న హీరోయిన్లు!

Heorines not interested to act with Sunil

06:28 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Heorines not interested to act with Sunil

కమీడియన్‌ నుండి కామెడీ హీరోగా, కామెడీ హీరో నుండి మాస్‌ హీరోగా ప్రమోట్‌ అయిన హీరో సునీల్‌. తాజాగా నటించిన 'కృష్ణాష్టమి' చిత్రం విడుదలకు సిద్ధమవుతుండగా మరో రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. సునీల్‌, వంశీ కృష్ణ ఆకెళ్ల డైరక్షన్‌లో ఒక చిత్రం నటిస్తుండగా, వీరూ పోట్ల దర్శకత్వంలో 'ఈడు గోల్డ్‌ ఎహే' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించే వాళ్లు క్రేజ్‌ ఉన్న వారైతే యూత్‌కి త్వరగా కనెక్ట్‌ అవ్వొచ్చని సునీల్‌ అభిప్రాయం. అందుకే ఈ చిత్రంలో రీచాపనయ్‌, సుష్మారాజ్‌ హీరోయిన్లుగా నటిస్తే బాగుంటుందని సునీల్‌ వీరూ పోట్లకి చెప్పాడట.

వీరుపోట్ల ఈ ఇద్దరినీ సంప్రదించగా సునీల్‌తో నటించమని చెప్పారట. సునీల్‌ని ఇంకా కామెడీ హీరోగానే చూస్తున్నారు, ఇలాంటి హీరోతో నటిస్తే తమ కెరీర్‌కి ఏమైనా గండి పడుతుందేమో అని ఆ కథానాయికలు భయం. ఎప్పడూ స్టార్‌ హీరోలతో నటించాలని అనుకునే హీరోయిన్లు సునీల్‌ కు ఇలా షాక్‌ ఇచ్చారు.

English summary

Heorines not interested to act with Sunil in Eedu Gold Ehe.