ఇండియాని వణికిస్తున్న వైరస్

Hepatitis virus in India

01:16 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Hepatitis virus in India

ప్ర‌పంచాన్ని ఇప్పుడు ఎయిడ్స్ కంటే ఓ భ‌యంక‌ర‌మైన వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. ఎయిడ్స్ కంటే వేగంగా విస్త‌రిస్తున్న ఈ వైర‌స్ ఇప్పుడు మాన‌వాళికి పెద్ద ప్ర‌మాద‌క‌రంగా మారింది. ఈ వైర‌స్ కేసులు ఇండియాలో రోజు రోజుకు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్నాయి. ఎయిడ్స్ వ్యాప్తికి, విస్త‌ర‌ణ‌కు అన్నా లిమిట్స్ ఉన్నాయేమో గాని ఈ ప్రాణాంత‌క వైర‌స్ విస్త‌ర‌ణ‌కు మాత్రం అడ్డూ అదుపూ లేదు. మ‌న‌దేశాన్ని అంత‌లా భ‌య‌పెడుతున్న ఆ వైర‌స్ ఏదో కాదు హెప‌టైటిస్‌. మ‌న‌దేశంలో చాలా మంది ప్ర‌జ‌లు సుర‌క్షిత‌మైన మంచినీరు దొర‌క్క ఈ వైర‌స్ భారిన ప‌డుతున్న‌ట్టు నివేదిక‌లు చెపుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త

తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈసారి దేశంలో ఎక్కువ హెపటైటిస్ కేసులు నమోదవుతాయని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మంచినీటిలో రసాయనాలు లేదా మురుగునీరు కలసిన నీటిని తాగడం వల్ల హెపటైటిస్ ఏ, ఈ, జబ్బులు వస్తాయని, వీటి వల్ల మనుషుల్లో కాలేయం పాడువుతుందని, గర్భవతులు మృత్యువాత కూడా పడతారని కేంద్ర వైద్యాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యాధి ఒక‌రినుంచి మ‌రొక‌రికి శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతుంది. ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్’ లెక్కల ప్రకారం దేశంలో గతేడాది 1,33,625 హెపటైటిస్ కేసులు నమోదయ్యాయి. వారిలో 397 మంది మరణించారు.

ఇది కూడా చదవండి: రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

బీహార్‌లో 25, 808 కేసులు, మధ్యప్రదేశ్‌లో 12,938, ఉత్తరప్రదేశ్‌లో 11,088, దేశరాజధాని ఢిల్లీలో 8,362, పశ్చిమ బెంగాల్లో 3,865 కేసులు నమోదయ్యాయి. బెంగాల్లో 81 మంది, ఢిల్లీలో 76 మంది, యూపీలో 62 మంది మరణించారు. దేశ జనాభాలో రెండు నుంచి ఐదు శాతం మంది హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. తాగేందుకు రక్షిత మంచినీరు అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ఒక్కటే పరిష్కారమార్గమని ఆ సంస్థ సూచించింది. ముందుగా కామెర్ల‌తో బ‌య‌ట‌ప‌డే ఈ వ్యాధి క్ర‌మ‌క్ర‌మంగా మ‌నిషి లివ‌ర్‌ పై ఎఫెక్ట్ చూపి లివ‌ర్ క్యాన్స‌ర్‌కు దారి తీస్తుంది. హెప‌టైటిస్ వ్యాధి సోకాక మందు లేదు. ముందే యాంటీ వైర‌స్ వేయించుకోవాలి.

ఇది కూడా చదవండి: అవకాశం కోసం రెజీనా ఇంతగా దిగజారిందా?!

English summary

Hepatitis virus in India