ఈ బామ్మకు 117 ఏళ్లు... ఏం తింటుందో తెలుసా?

Her age is 117 years but do you know what she is eating

01:26 PM ON 1st December, 2016 By Mirchi Vilas

Her age is 117 years but do you know what she is eating

ఈరోజుల్లో ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎన్ని వైద్య సదుపాయాలు పెరిగినా వందేళ్లు జీవించడం చాలా కష్టం. ఆరోజుల్లో పరిస్థితులు, సదుపాయాలు, కష్టపడి పనిచేయడం, అన్నింటికీ మించి కల్తీ లేని తిండి ఉండడం వంటి పరిణామాల నేపథ్యంలో వందేళ్లు జీవించిన వాళ్ళు చాలామంది వున్నారు. శతాధిక వృద్ధులు ఇప్పటికీ వున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటోలోని ఇటలీ బామ్మ పేరు ఎమ్మా మోరానో.. వయసు 117 ఏళ్లు.. మంగళవారం పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ప్రస్తుతం జీవించి ఉన్న శతాధిక వయస్కులలో ఈ బామ్మే పెద్దదని గిన్నీస్ బుక్ వాళ్లు సర్టిఫికేట్ ఇచ్చారట!

1899 నవంబరు 29న జన్మించిన ఈ బామ్మ మూడు శతాబ్ధాలు(19, 20, 21) చూసింది.. ఏడాదిగా మంచానికే పరిమితమైన ఈ బామ్మ ఆహారం ఏంటంటే.. రోజుకు రెండు గుడ్లు, ఆపై కాసిన్ని బిస్కెట్ ముక్కలు మాత్రమే! బంధువులు పెద్దగా లేకున్నా.. దేశవిదేశాలనుంచి తనను చూడడానికి వస్తుంటారని ఈ బామ్మ బోసినోటితో నవ్వుతూ చెబుతోంది. దటీజ్ బామ్మ.

English summary

Her age is 117 years but do you know what she is eating