పార్లమెంట్ ని కుదిపేసిన నేషనల్ హెరాల్డ్ వ్యవహారం 

Herald Issue Fires in Parliament

12:39 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Herald Issue Fires in Parliament

నేషనల్ హెరాల్డ్ వ్యవహారం బుధవారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేశాయి. ఈ కేసులో ఎఐసిసి అధినేత్రి సోనియా గాంధి , ఎఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధి లను ఈనెల 19వ తేదీన హాజరు కావాలని పాటియాలా కోర్టు పేర్కొంది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు ని ఆశ్రయించినా ఫలితం లేదు. మరోపక్క సుప్రీం కోర్టు కి వెళ్లాలని భావిస్తున్నారు. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో నిన్న , ఈవేళ కూడా కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ సభ్యలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు లోక సభలో స్పందిస్తూ , కాంగ్రెస్ సభ్యుల ఆరోపణలను తిప్పికొట్టారు. స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినా ఆందోళన సద్దుమణగక పోవడంతో సభను కొద్దిసేపు వాయిదా వేసారు.

English summary

National Herald issues heats in parliament sessions.Congress party opposes that issues and speaker Postponed the sessions for some time