ప్లూటో ఫొటోలు ఇవిగో

Here Are The Pluto Photos

12:09 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Here Are The Pluto Photos

నెలల తరబడి ప్రయాణం అనంతరం న్యూహరిజాన్స్‌ ఉపగ్రహం మరుగుజ్జు గ్రహమైన ఫ్లూటో చిత్రాలను పంపడం మొదలు పెట్టిందట. వీటిని గత వారం నాసా విడుదల చేసింది. మానవుల కంటికి ఇప్పటికి వరకూ చిక్కని ఫ్లూటో ఎలా ఉంటుందోనని ఎప్పటినుండి శాస్త్రవేత్తల్లో జిజ్ఞాస ఉంది. కానీ ఇప్పుడు న్యూ హారిజాన్స్‌ ఆ కలను నెరవేర్చింది. హై రిజల్యూషన్‌తో నాసా విడుదల చేసిన చిత్రాలు ఫ్లూటో గురించి ఏళ్ళ తరబడి ఉన్న ఎన్నో అనుమానాలను పటాపంచలు చేయనున్నాయి. నాసా విడుదల చేసిన ఒక్కో చిత్రం ఫ్లూటో గ్రహం ఉపరితలం పై నుండి సుమారు 50 మైళ్ళ విస్తీర్ణాన్ని చిత్రీకరించారు. ఫ్లూటో గ్రహం యొక్క భౌగోళిక స్వరూపంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వస్తున్నారు. న్యూహారిజన్స్‌ విడుదల చేసిన ఈ చిత్రాలతో ఫ్లూటో గ్రహం పుట్టుపూర్వోత్తరాలు, వాతావరణాన్ని అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు సన్నద్ధం అయ్యారట.

English summary

New Horizons Satellite sends photos of the pluto planet. Nasa released the photos of pluto. The satellite sends high resolution images