వంగవీటి సినిమాలో గంగూలీ

Here is the Vangaveeti Ranga's wife Vangaveeti Rathna Kumari

04:32 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Here is the Vangaveeti Ranga's wife Vangaveeti Rathna Kumari

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌వర్మ తెలుగులో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'వంగవీటి'. విజయవాడ రాజకీయనేత వంగవీటి రంగా జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబందించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి రామ్‌ గోపాల్‌వర్మ విజయవాడలో సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వంగవీటి రంగా పాత్రలో నటిస్తున్న నటుడికి సంబంధించిన ఫోటోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ చిత్రం లోగోని కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా వంగవీటి రంగా భార్య రత్నకుమారి పాత్రలో నటిస్తున్న నటి ఫోటోలు విడుదల చేశాడు వర్మ. వంగవీటి రంగా భార్య రత్నకుమారి పాత్ర కోసం బెంగాళికి చెందిన నటిని ఎంపిక చేసుకున్నాడు వర్మ.

ఈ చిత్రంలో వంగవీటి భార్య రత్నకుమారి పాత్రకి కూడా పూర్తిస్థాయి ప్రాధాన్యత ఉండడంతో ఆ పాత్ర చేసే అమ్మాయి కోసం తీవ్రంగానే గాలించాడు వర్మ. వంగవీటి రంగాని చంపేశాకనే రత్నకుమారి గారు వెలుగులోకి వచ్చింది. అయితే రంగాని చంపక ముందు రత్నకుమారి అనుభవించిన బాధని, ఆ భావోద్వేగాలని నటనలో చూపించగల అమ్మాయిని వెతుకుతున్న సమయంలోనే బెంగాళి నటి నైనా గంగూలిని వర్మ ఎంచుకున్నాడు. ఇప్పుడు ఆ రత్నకుమారి పాత్రలో చేసిన నైనా గంగూలి ఫోటోలని వర్మ విడుదల చేశాడు.

ఆ ఫోటోలని స్లైడ్‌ షోలో మీరు కూడా చూడండి

1/6 Pages

వంగవీటి రత్నకుమారి:

వంగవీటి సినిమా లో వంగవీటి రంగా భార్య వంగవీటి రత్నకుమారి పాత్రలో నటిస్తుంది ఈమె.

English summary

Here is the Vangaveeti Ranga's wife Vangaveeti Rathna Kumari. Bengali actress Naina Ganguly is acting as a Vangaveeti Rathna Kumari in Vangaveeti movie.