తండ్రి అయిన మరో హీరో

Hero Adhi Becomes Dad

03:52 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Hero Adhi Becomes Dad

టాలీవుడ్‌ నటుడు సాయికుమార్‌ వారసుడిగా తెలుగు చలన చిత్ర సీమలోకి హీరోగా అడుగుపెట్టిన ఆది. తను నటించిన సినిమాలతో టాలీవుడ్‌ లో తనదంటూ ఒక ఇమేజ్‌ ఏర్పరచుకున్నాడు.

గత సంవత్సరం డిసెంబర్‌ 13 న రాజమండ్రి కి చెందిన అరుణ తో వివాహమైంది. కాగా గురువారం మధ్యాహ్నం ఆది భార్య అరుణ రాజమండ్రి లోని ఒక ప్రవేటు ఆసుపత్రి లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆది కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు బిడ్డ పుట్టిందని ఆది స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

ప్రస్తుతం ఆది తన తండ్రి సాయికుమార్‌ తొలిసారి స్వయంగా నిర్మిస్తున్న "గరం" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆదాశర్మ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం.

English summary

Tollywood Young Hero Adhi Blessed with a daugher on thursday in a private hospital in Rajahmundry. This was announced by adhi through Social Media