ఊరుని దత్తత తీసుకున్నాడు!!

Hero Aditya Om adopted village

10:14 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Hero Aditya Om adopted village

'లాహిరి లాహిరి లాహిరి'లో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆదిత్య ఓం ఆ తరువాత పలు చిత్రాలతో ఆకట్టుకున్నాడు. ఆ తరువాత కొన్ని ఫ్లాప్స్ రావడంతో సినిమా లకు దూరమయ్యాడు. అయితే పెద్ద హీరోలు సైతం కోట్లకి కోట్లు ఉన్నా బీధ వాళ్ళని పాటించుకొని తరుణంలో ఇటువంటి చిన్న హీరో ముందుకొచ్చి ఒక ఊరుని దత్తత తీసుకోవడమంటే మామూలు విషయం కాదు. తను దత్తత తీసుకున్న 'చెరుపల్లి' కి ఆదిత్య ఓం విచ్చేశారు. ఆదిత్య తో పాటు నిర్మాతైన విజయ్ వర్మ పాకలపాటి కూడా విచ్చేశారు. 'పాకలపాటి సుబ్బారాజు ప్రజా లైబ్రరీ' అనే పేరుతో ఒక లైబ్రరీ ని విజయ్ వర్మ గారు ప్రారంభించారు.

ఆ తరువాత ఆదిత్య ఓం మాట్లాడుతూ రాబోయే 10 సంవత్సరాలు పాటు ఈ సామాజిక సేవలో పాల్గొంటాను. విద్య, క్రీడ, నీరు, మరియు టాలెంట్ ఏ చెరుపల్లి గ్రామం అభవృద్ధి అవ్వడానికి ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించి అన్ని నేను సమకూరుస్తాను అని ఆదిత్య ఓం తెలిపారు. అంతే కాదు క్రీడలకు సంబంధించిన వస్తువులు కూడా స్కూల్ పిల్లలకు అందించారు. వారికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు, పూల మాలలతో సత్కరించారు. నిజంగా వీరిని అభినందించాల్సిందే కదా....

English summary

Lahiri Lahiri Lahirilo fame Hero Aditya Om adopted Cherupally village. He providing all needs to that village. And also producer Vijay Varma Pakalapati also adopted that village.