జయ వారసుడు అజిత్!

Hero Ajith was Next CM of Tamilnadu

11:24 AM ON 8th October, 2016 By Mirchi Vilas

Hero Ajith was Next CM of Tamilnadu

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తీవ్ర అస్వస్థత, సుదీర్ఘకాలం ఆస్పత్రిలో ఉండాల్సి రావడంతో, పాలనలో మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో జయ ఇప్పట్లో పాల్గొనడం కష్టమే అని తేలిన నేపథ్యంలో, తాత్కాలిక ఏర్పాట్లు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జయలలిత పట్ల విపరీతమైన అభిమానం చూపించే ప్రముఖ నటుడు అజిత్ పేరు ఇప్పుడు అన్నాడీఎంకేలో చర్చనీయాంశమైంది. ప్రస్తుత నటుల్లో నా చరిష్మా, నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అజిత్. నా వారసుడి లక్షణాలు ఆయనలోనే అధికంగా ఉన్నాయి అని జయ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. గతంలో అజిత్ రెండు, మూడు మార్లు జయను కలుసుకుని తన అభిమానాన్ని చాటుకున్నారు.

జయ పరోక్షంలో, ఆమెకు బదులుగా పాలన నడిపించేందుకు మరొకరి అవసరం వీలుగా మరొకరి అవసరం ఏర్పడింది. అందుకే, ఉప ముఖ్యమంత్రి ఎంపికకు రంగం సిద్ధమవుతోంది. ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంల పేర్లు ప్రముఖంగా తెరమీదకి వచ్చాయి. జయ అనారోగ్యంపాలైన తొలినాళ్లలోనే డిప్యూటీ సీఎం పదవికి ఈ ఇద్దరి పేర్లను పరిశీలించారు. తాజాగా, పరిపాలనలో జయ పాలుపంచుకోవడం ఇప్పట్లో కష్టమని వైద్యులు చెబుతున్నందున ఉప ముఖ్యమంత్రి పదవి ఎంపిక కోసం కసరత్తు ప్రారంభమైంది.

ఒకటి రెండ్రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నా డీఎంకేలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం రాష్ట్ర గవర్నర్ సీహెచ విద్యాసాగరరావుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు రెండుమార్లు భేటీ అయ్యారు. ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం కూడా గవర్నర్ తో భేటీ కావడంతో, ఉప సీఎం పై కసరత్తు జరుగుతోందనే చర్చలకు బలం చేకూరింది. అయితే, రాజ్ భవన మాత్రం ఈ వ్యవహారంపై భిన్నమైన ప్రకటన చేసింది. కావేరీ సమస్యపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్లు గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:వివాహిత ప్రాణాన్ని బలిగొన్న ఫేస్ బుక్

ఇవి కూడా చదవండి:కలలో మీరు గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు వస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా?

English summary

Tamilnadu Chief Minister Jaya Lalitha was struggling in Chennai Apollo Hospital and doctors have confirmed that she was recovering slowly in hospital and now a news came to know that Ajith was going to be next Chief Minister of Tamilnadu.