ఆ హీరో త్రిషను అంతమాటన్నాడా!!

Hero Arya called Trisha as sister

01:42 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Hero Arya called Trisha as sister

'జోడి' సినిమాలో హీరోయిన్ స్నేహితురాలు పాత్రతో కెరీర్‌ను మొదలుపెట్టింది త్రిష. దాదాపు దశాబ్ధం కాలంపాటు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. త్రిష తన పెళ్ళి రద్దు అయిన తర్వాత సెకెండ్‌ ఇన్సింగ్స్‌ ను మొదలుపెట్టింది. వరుస అవకాశాలతో దూసుకువెళ్తుంది త్రిష. ఇటీవల విడుదలైన చీకటిరాజ్యం, కళావతి సినిమాలతో విజయం సాధించింది. త్రిష ఒక ప్రముఖ చ్యానెల్ కి ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. త్రిష 'కళావతి' సినిమాలో నటించడానికి కారణం కుష్బూ అని చెప్పింది. కుష్బూ తనకి మంచి స్నేహితురాలట. నటుడు ఆర్య ఇటీవల ఓ ఇంటర్‌వ్యూ లో త్రిష నా చెల్లి అని చెప్పాడు దీని పై త్రిష స్పందించింది.

అసలు ఆర్య అలా చెప్పిన విషయం తనకి తెలియదట. ఆర్య చాలామంచి వ్యక్తి తనతో ఏ విషయమైనా పంచుకోవచ్చని త్రిష చెప్పింది. ఆర్య నన్ను చెల్లి అనడం నిజంగా పెద్ద జోక్. ఆర్యను ఖచ్చితంగా అడుగుతాను అంది త్రిష. ఇక రానాకీ తనకీ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అట. మేము ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని మీడియాలో అసత్య ప్రచారం మాత్రమే అని స్పష్టం చేసింది. మనసుకి నచ్చిన వాడు దొరికితే తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. అయితే ఇప్పట్లో త్రిషకు పెళ్ళి ఆలోచన లేదంట.

English summary

Tamil hero Arya called hot beauty Trisha as a sister. But Trisha don't know this issue. She said that i will defenetly ask Arya about this issue.