46 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటున్న హీరో

Hero JD Chakry Getting Married

12:41 PM ON 18th April, 2016 By Mirchi Vilas

Hero JD Chakry Getting Married

అవునండి మీరు విన్నది నిజమే , ఒక ప్రముఖ తెలుగు హీరో 46 ఏళ్ళ లేటు వయసులో పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో "జే.డి" పాత్ర తో మనందరికీ పరిచయమైన చక్రవర్తి . శివ సినిమాలో తాను పోషించిన పాత్ర పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు . ఒక నటుడిగా , హీరో గా , దర్శకుడి గా ఇలా అనేక పాత్రలు పోషించిన జే.డి.చక్రవర్తి ఎట్టకేలకు పెళ్ళికొడుకు కాబోతున్నాడు.

ఇవి కూడా చదవండి: ఊహకు అందని వింత ప్రదేశాలు

జే.డి.చక్రవర్తి కి ఇంకా పెళ్లి కాలేదా అనుకుంటున్నారా .. అవునండి నిజం జే.డి.చక్రవర్తి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. కొన్ని ప్రేమ వ్యవహారాలూ బెడిసికొట్టడం వల్ల తాను పెళ్లి చేసుకోనని అనేక సార్లు స్పష్టం చేసిన ఈ హీరో ఇప్పుడు తన అభిప్రాయం మార్చుకున్నాడు . జే.డి.చక్రవర్తి తల్లి చేసిన ఒత్తిడితో ఆయన ఢిల్లీ కి చెందిన ఒక వ్యాపారవేత్త కుటుంభానికి చెందిన అమ్మాయిని జే.డి. చక్రవర్తి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయమై జే.డి.చక్రవర్తి మాట్లాడుతూ పెళ్లి చేసుకుంటే వచ్చే భాద్యతలను మోయగలిగే మెచ్యూరిటీ నాకు ఇప్పుడు వచ్చిందని అనుకొంటున్నానని జెడీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

సౌందర్య చనిపోతుందని వాళ్ళ తండ్రికి ముందే తెలుసా?

చిరు ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

టీడీపీలో మగాళ్లు లేరా: రోజా సవాల్‌

English summary

Actor ,Director,Hero J.D.Chakravarthy to get married at the age of 46. He going to marry a Business man Daughter.