హైదరాబాద్‌ జైల్లో సూర్య తమ్ముడు!!

Hero Karthi in Chanchalguda jail

04:46 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Hero Karthi in Chanchalguda jail

తమిళ స్టార్‌ హీరో సూర్య సోదరుడు కార్తీ అక్కినేని నాగార్జునతో కలిసి 'ఊపిరి' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు కార్తీ జైల్లో ఉన్నారు. కంగారుపడకండి జైలుకి వెళ్లింది ఘాటింగ్‌ కోసం. బృందావనం ఫేమ్‌ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నా ఈ చిత్రంలో తమన్నా, గాబ్రియేలా కథానాయికలు. ఈ చిత్రానికి సంబంధించిన కొని సన్నివేశాలు చంచల్‌గూడ జైల్లో తెరకెక్కించాల్సి ఉందట. కానీ జైలు అధికారులు లోపల ఘాటింగ్‌ చెయ్యడానికి పర్మిషన్‌ ఇవ్వలేదట బయటయితే ఓకే అని చెప్పారట. అందుకు బయటే ఘాటింగ్‌ చేస్తున్నారు.

ఈ ఘాటింగ్‌కి కార్తీతో పాటు కామెడియన్‌ అలీ కూడా వచ్చాడంట, విషయం తెలిసి చుట్టుప్రక్కల వాళ్లతో పాటు ఖైధీలను చూడడానికి వచ్చిన బంధువులు కూడా కార్తీ, అలీలతో సెల్ఫీలు దిగుతున్నారు. ఫ్రెంచి చిత్రం ఆధారంగా రీమేక్‌ అవుతున్న ఈ చిత్రంలో అనుష్క కూడా అతిధి పాత్రలో కనిపించబోతోంది. ఇందులో నాగార్జున ఎక్కువ శాతం వీల్‌ఛైర్‌లోనే కూర్చుంటాడట. పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Hero Karthi in Chanchalguda jail for shooting of Oopiri movie. Directing by Vamsi Pydipally.