జయప్రదను చూసి లొట్టలేసుకున్న కలెక్షన్ కింగ్

Hero Mohan Babu Commnets On Jayaprada

10:31 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Hero Mohan Babu Commnets On Jayaprada

అవును, ఈ మాట ఎవరో అంటే ఏమో అనుకోవచ్చు. స్వయంగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబే చెప్పాడు. టాలీవుడ్ లో అడుగుపెట్టి 40 ఏళ్ళయిన సందర్బంగా విశాఖలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమం పోటాపోటీ పొగడ్తలతో సాగింది. 'ఇప్పటి జనరేషన్ లో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. కానీ జయప్రద వాట్ ఏ బ్యూటీ' అంటూ ఆమెను మోహన్ బాబు ఆకాశానికి ఎత్తేసాడు. అంతేకాదు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇప్పటికీ చూస్తే అంటూ.. ‘నా భార్య ఉంది గానీ లేకపోతే తాను అప్పుడప్పుడూ జయప్రదను చూసినప్పుడు లొట్టలేసుకుంటూ ఉంటా' అని మోహన్ బాబు అనడంతో అయితే ఈ సమయంలో అటు జయప్రదతో పాటు మోహన్ బాబు సతీమణి కూడా నవ్వులు పూయించారు. సభలో కేరింతలు మారుమోగాయి. అయితే మోహన్ బాబు సరదాగానే అన్నా, పంచ్ పేలింది. 'జయప్రద ఓ మంచి నటి. నేను అసిస్టెంట్ డైరక్టర్ గా చేసినప్పుడే ఆమె హీరోయిన్ . జయప్రదతో హీరోగా, విలన్ గా కూడా చేశా. అలాంటి జయప్రద ఎంతో దూరం నుంచి రెండు మూడు ఫ్లైట్ లు మారతూ ఇంత ప్రేమగా కార్యక్రమానికి వచ్చినందుకు హృదయపూర్వకంగా అభినందనలు' అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చూడండి: మగవాళ్ళు గడ్డం పెంచితే ఏమవుతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: మేకప్ లేకుండా మన హీరోయిన్స్‌ను చూడలేం !!!

ఇది కూడా చూడండి: దెయ్యాలను గుర్తించడం ఎలా ?

English summary

Hero Mohan Babu Commnets On Jayaprada