పెళ్లికి ముస్తాబవుతున్న నిఖిల్‌!!

Hero Nikhil is now ready for marriage

07:02 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Hero Nikhil is now ready for marriage

స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య వంటి హ్యట్రిక్‌ విజయాలతో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌ తాజా చిత్రం 'శంకరాభరణం' డిసెంబర్‌ 4న విడుదలవుతుంది. ఇదిలా ఉండగా ఇప్పటిదాకా నా పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చాను కానీ మా చెల్లెలి పెళ్లి కాగానే నా పెళ్లి ప్రస్తావన ఇంట్లో వచ్చింది. ఐతే వరుసగా రెండు సినిమాలు హిట్‌ అయితే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో మాటిచ్చాను. కానీ రెండు సినిమాలు హిట్‌ అయినప్పటికీ నాలో ఆశ పెరిగి ఇంకా ఎక్కువ సినిమాలు హిట్లు కొట్టాలని ధ్యేయం పెట్టుకున్నా. ఇప్పుడు ఇంట్లో పోరు ఎక్కువైంది అందుకే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నా అని నిఖిల్‌ చెప్పాడు.

త్వరలోనే అంటే రెండు మూడు సంవత్సరాలకి కాదు 2016 వేసవి లోపు తన పెళ్లి చేసుకుంటాడట. ఇంకో నాలుగైదు నెలల్లో పెళ్లి చేసుకుంటానని నిఖిల్‌ తల్లిదండ్రులకి ప్రామిస్‌ కూడా చేశారట. మరి నిఖిల్‌కి కాబోయే వధువు ఎవరో? ఎక్కడ ఉందో?

English summary

Hero Nikhil is now ready for marriage in 2016 summer. On december 4th his sankharabharanam movie is releasing.