'నేషనల్‌ అథ్లెట్'గా నితిన్‌!

Hero Nithin as a National Athlet

06:35 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Hero Nithin as a National Athlet

దాదావు ఏడు సంవత్సరాలు వరుస ఫ్లాప్‌లతో కూరుకుపోయిన హీరో నితిన్‌ ఆ తరువాత 'ఇష్క్‌' చిత్రంతో జయభేరి మ్రోగించాడు. ఆ తరువాత వచ్చిన గుండె జారీ గల్లంతయ్యిందే, హార్ట్‌ఎటాక్‌ చిత్రాలు కూడా హిట్‌ అవ్వడంతో ఫార్మ్లోకి వచ్చేశాడు. ఆ వెంటనే 'చిన్నదాన నీకోసం', 'కొరియర్‌ బాయ్‌ కల్యాణ్' చిత్రాలు అట్టర్‌ఫ్లాప్‌లతో నిరాశాపరిచాయి. దాదాపు సంవత్సరం గ్యాప్‌ తీసుకుని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌ నటిస్తున్నాడు. అ..ఆ.. పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్‌ సరసన మొదటిసారి సమంత నటిస్తుంది.

అ..ఆ.. చిత్రం షూటింగ్‌ అయిపోయిన వెంటనే మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో నితిన్‌ సినిమా చేయనున్నాడు. ఆ తరువాత పాటల రచయిత నుండి దర్శకుడిగా మారిన కృష్ణచైతన్యతో ఒక సినిమా చేయేబోతున్నాడు. ఇవన్నీ లైన్లొ ఉండగానే మరో చిత్రం నితిన్‌ లైన్లోకీ వచ్చింది. అధర్వ, శ్రీదివ్య హీరోహీరోయిన్లుగా రవి అరసు అనే నూతన దర్శకుడ తెరకెక్కించిన తమిళ చిత్రం 'ఈట్టి'. ఒక నేషనల్‌ లెవల్‌ అథ్లెట్ అయిన హీరో ఓ దొంగ నోట్ల కేసులో ఇరుక్కుని దాన్నుంచి ఎలా బయట పడ్డాడనే థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో వారం రోజులు క్రిందట రిలీజై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో నితిన్‌తో రీమేక్‌ చెయ్యాలని 'ఈట్టి' దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట. ఈ చిత్రంలో నటించడానికి నితిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు సమాచారం. 'ఈట్టి' చిత్రాన్ని బాలీవుడ్‌లో షాహిద్‌ కపూర్‌ తో చేసే అవకాశాలున్నాయని సమాచారం.


English summary

Hero Nithin as a National Athlet role. Tamil super hit movie Etti is remaking by Nithin in telugu.