బిజీలోనూ అసిస్టెంట్ పెళ్ళికెళ్ళి గొప్పతనాన్ని చాటుకున్న ప్రభాస్ 

Hero Prabhas in his assistant marriage

06:30 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Hero Prabhas in his assistant marriage

తమకు వెన్నంటి వుండి అన్ని పనుల్లో తోడ్పడే సహాయకులను కూడా కనిపెట్టుకుని వుండడం చాలామందికి చేతకాదు. కొంతమంది కుదరకైతే, మరికొందరు మనకెందుకులే అని పట్టించుకోరు. కానీ నిత్యం బిజీలో ఉంటూ కూడా వీలు చూసుకుని మరీ తమ హాజరు చూపించుకుని, ఆనందం పంచుతారు. సరిగ్గా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా అదే చేసాడు. రాజమౌళి మాటకి ఎదురు చెప్పకుండా ప్రస్తుతం ‘బాహుబలి - ద కంక్లూజన్’ సినిమా షూటింగ్‌లో తన ఒళ్ళు హూనం చేసుకుంటూ బిజీగా ఉన్న డార్లింగ్ హీరో ప్రభాస్ కాస్త సమయం దొరక బుచ్చుకుని మరీ ఆ సమయంలోనూ తమ సహాయకుల కోసం కేటాయిస్తుంటాడు.

తాజాగా హైదరాబాద్‌లోని చందానగర్‌లో జరిగిన తన సహాయకుల వివాహానికి స్వయంగా వెళ్ళి అభినందనలు తెలిపాడట. ఇంత టైట్ షెడ్యూల్ మధ్య కూడా ప్రభాస్ తమ వివాహానికి హాజరై విష్ చేయడంతో ఆ నవ దంపతుల ఆనందానికి అవధుల్లేవ్. ఈ రకంగా మరోసారి తాను అందిరికీ డార్లింగే అనిపించుకున్న కండలవీరుడు ప్రభాస్ ఇక తన పెళ్ళి కబురు ఎప్పడు చెబుతాడో మరి. ఈ తీపి కబురు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఈ హీమాన్ అభిమానులు...

English summary

Young Rebel Star Prabhas in his assistant marriage. In his busy schedule he went his assistant marraige and shows his good heart again.