నేను-శైలజలో ప్రిన్స్‌!!

Hero Prince is acting in Nenu-Sailaja

03:06 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Hero Prince is acting in Nenu-Sailaja

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌, కీర్తి సురేష్‌ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నేను-శైలజ'. స్రవంతి మూవీస్‌ పతాకం పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. గత కొద్ది కాలంగా ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న రామ్‌ ఈ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయగా ఆ పోస్టర్‌కి అనూహ్య స్పందనే వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో యువ హీరో కూడా నటిస్తున్నాడు. నీకు నాకు డాష్‌ డాష్‌, బస్‌స్టాప్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రిన్స్‌ నేను -శైలజలో హీరోయిన్‌కు అన్నగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో ప్రిన్స్‌ పాత్రకి మంచి ప్రాధన్యం ఉందట, అందువల్లే ప్రిన్స్‌ను ఎంపిక చేసుకున్నారట. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ చిత్రం న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదలవుతుంది.

English summary

Hero Prince is acting in Nenu-Sailaja as a brother to heroine Keerthi Suresh.