'జనతా గ్యారేజ్' కాప్షన్ మార్చాలన్న రామ్

Hero Ram asked to change Janatha Garage caption

12:02 PM ON 21st May, 2016 By Mirchi Vilas

Hero Ram asked to change Janatha Garage caption

'నాన్నకు ప్రేమతో' చిత్రం తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. శ్రీమంతుడు వంటి సూపర్ హిట్ ని అందించిన కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను గురువారం విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ఫస్ట్ లుక్ ను ఎన్టీఆర్ తన అభిమానులతో పంచుకుంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ఈ పోస్టర్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి. ఇచ్చట 'అన్నీ రిపేర్లు చేయబడును' అనే క్యాప్షన్ తో జనతా గ్యారేజ్ తెరకెక్కుతోంది. అయితే ఇప్పుడు క్యాప్షన్ ను మార్చాలని ఎనర్జటిక్ హీరో రామ్ కోరుతున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన రామ్ ఈ సందర్భంగా 'జనతా గ్యారేజ్’ క్యాప్షన్ కూడా మార్చమని సలహా ఇచ్చాడు. జనతా గ్యారేజ్ రిలీజ్ తరువాత సినిమాకి క్యాప్షన్ 'ఇచ్చట అన్ని రికార్డులు సెట్ చేయబడును' అని మారాలని కోరుకుంటున్నట్లు రామ్ పోస్ట్ చేశాడు.

English summary

Hero Ram asked to change Janatha Garage caption. Energetic Hero Ram asked to change Janatha Garage movie caption.