రామ్‌ కొత్తసినిమా టైటిల్ ఇదా!!!

hero ram new movie title is not fixed

01:09 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

hero ram new movie title is not fixed

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా ఇటీవలే రిలీజైన చిత్రం 'శివమ్‌' ఇది డిజాస్టర్‌ అవ్వడంతో, రామ్‌ కిషోర్‌ తిరుమల అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ సొంత బ్యానర్‌ అయిన స్రవంతి రవికిషోర్‌ నిర్మాణంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి 'హరికధ' అని వర్కింగ్‌ టైటిల్‌ ఉన్నా ఆ టైటిల్‌ని ఇంకా ఫైనల్‌ చేయలేదు. ఈ చిత్రానికి 'నేను శైలజ' అనే పరిశీలనలో ఉంది ఈ టైటిల్‌ విషయమై ఈ వారంలోనే కరెక్ట్‌ టైటిల్‌ ను ఫిక్స్‌ చేసి ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఘాటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా మిగతా ఘాటింగ్‌ అంతా పూర్తి చేసుకుంది. ఇంకా మిగిలి ఉన్న ఆ ఒక్క పాటను నిన్నటి నుండి గోవాలో మొదలు పెట్టారు, ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుపుకుంటుంది.

ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. డిసెంబర్‌ మూడో వారంలో ఆడియోని రిలీజ్‌ చేసి న్యూఇయర్‌ కానుకగా జనవరి 1 న చిత్రాన్ని విడుదల చెయ్యాలని సన్నాహాలు చేస్తున్నారు.

English summary

hero ram new movie title is not fixed