హీరో రామ్‌కి 'తిక్క రేగింది'

Hero Ram signs for new movie Thikka Regithe

03:12 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Hero Ram signs for new movie Thikka Regithe

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ఈ ఏడాది నటించిన పండగ చేస్కో, శివమ్‌ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో ఈ సారి కధలను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. ఆ జాగ్రత్తతోనే రామ్‌ ఒక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ని ఎంచుకున్నాడు. అదే 'నేను-శైలజ', కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం న్యూఇయర్‌ కానుకగా జనవరి 1న విడుదల అవుతుంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం పైనే రామ్‌ ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఈ చిత్రం విడుదల కాకుండానే రామ్‌ మరో సినిమాకి సైన్‌ చేశాడు. రామ్‌తో 'కందిరీగ' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నాడు.

ఈ చిత్రానికి 'తిక్క రేగితే' అని పక్క మాస్ టైటిల్‌ పెట్టారు. కానీ ఈ చిత్రంలో ముందు అల్లు అర్జున్‌ నటించడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు, అయితే సంతోష్‌ శ్రీనివాస్‌ తెరకెక్కించిన 'రభస' చిత్రం ఫ్లాప్‌ కావడంతో అల్లు అర్జున్‌ సంతోష్‌ శ్రీనివాస్‌తో చిత్రం చెయ్యడానికి వెనుకడుగేశాడు. ఇదే కధని రామ్‌కి అనుగుణంగా మార్చి రామ్‌కి ఆ కధను వినిసించాడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఈ కధ నచ్చడంతో రామ్‌ సంతోష్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తిక్క రేగితే ఘాటింగ్‌ జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary

Hero Ram signs for new movie Thikka Regithe. This movie is directing by 'Kandireega' fame Santhosh Srinivas.