ఆమెతో డేట్ చేస్తానంటున్న 'రామ్'!!

Hero Ram want to date with Samantha

04:14 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Hero Ram want to date with Samantha

న్యూఇయర్‌కి 'నేను-శైలజ' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్‌ 2016లో మొదటి విజయం నమోదు చేసుకున్నాడు. ఈ చిత్రం సక్సెస్‌ ఎంజాయ్‌ చేస్తున్న రామ్‌కు ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఒక ఇంటరెస్టింగ్‌ క్వశ్చన్‌ ఎదురైంది. చాక్లెట్‌ బాయ్‌లా కనిపించే రామ్‌ని ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. అందుకే రామ్‌కి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే రామ్‌కి ఇష్టమైన అమ్మాయి ఎవరూ అని అడిగితే క్షణం కూడా ఆలోచించకుండా సమంత అని వెంటనే సమాధానమిచ్చాడు. అంతే కాదు డేటింగ్‌కి వెళ్లాల్సి వస్తే సమంతతోనే వెళ్తా అని తన మనసులో అభిప్రాయాన్ని చెప్పాడు రామ్‌.

సమంత ఒక న్యాచురల్‌ బ్యూటీ అని కూడా కితాబు ఇచ్చాడు రామ్‌. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు నటించలేదు కానీ రామ్‌ మాత్రం తన మనసులో అభిప్రాయాన్ని ఈ విధంగా బయటపెట్టాడు. ఈ విధంగా అయినా వీరిద్దరూ కలిసి సిల్వర్‌ స్క్రీన్‌ పై కనిపిస్తే బాగుంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. మరి ఇది ఎప్పటికి నెరవేరుతుందో?

English summary

Hero Ram want to date with Samantha.