12 ఏళ్లకే అవార్డు పట్టేసాడు

Hero Ram Wins Award At The Age Of 12

03:33 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Hero Ram Wins Award At The Age Of 12

చేతల్లో చిలిపితనం , చూపుల్లో చురుకుతనం, మాటల్లో దూకుడు. ఎనర్జీతో నిండిన నటన కలిసి ఏర్పడిన రూపంగా హీరో రామ్‌ అని చెప్పవచ్చు. యితడు చేసిన సినిమాలు తక్కువే అయినా సాధించిన విజయాలు , తెచ్చుకున్న ఇమేజ్‌ ఎక్కువ. ‘దేవదాస్‌’తో హీరోగా ప్రయాణాన్ని ప్రారంభించి తనదైన శైలిలో చిత్రాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ ఏడాది తొలి రోజే ‘నేను శైలజ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఘన విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం రామ్‌ జన్మదినం సందర్భంగా, కొన్ని పత్రికల్లో కధనాలు వెలువడ్డాయి. తరచూ ట్విట్టర్‌ వేదికగా అభిప్రాయాలను పంచుకునే, రామ్ పార్టీల్లో పాల్గొనడం పెద్దగా ఇష్ట పడడట. మార్షల్‌ ఆర్ట్స్‌ అంటే చాలా ఇష్టపడే రామ్‌కు చిన్నప్పటి నుంచి నటనంటే పిచ్చి. ఎక్కువ మార్కులు వస్తే ఎక్కడ పై చదువులు చదవమంటారో ఎక్కడ సినిమాల్లోకి వెళ్లకుండా ఉండిపోతానోనన్నంతగా ఇతడికి సినీ పిచ్చి. అదే మనకు ఓ ఎనర్జీ ఉన్న హీరోను కళ్లముందు ఉంచేలా చేసింది. హీరోగా తొలి చిత్రం ‘దేవదాసు’ అయినప్పటికీ, అంతకు ముందే రామ్‌ తమిళంలో 'ఐడీ' పేరుతో ఓ లఘు చిత్రంలో నటించాడు. ఆ చిత్రంలో రామ్‌ నటన యూరోపియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డును తెచ్చి పెట్టింది. అప్పటికి రామ్‌ వయసు 12 ఏళ్లు. అప్పుడే అవార్డు కొట్టేసిన రామ్ లో సినిమా హీరో కావాలన్న పట్టుదల మరింత హెచ్చింది. అదే ఊపుతో ముందుకు సాగిపోతున్నాడు.

ఇవి కూడా చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్

ఇవి కూడా చదవండి: హెలికాప్టర్ ను పేల్చేసిన ఉగ్రవాదులు(వీడియో)

ఇవి కూడా చదవండి: అండర్ వేర్స్ మర్చిపోను:సమంత

English summary

Tollywood Energetic Hero Ram was known for his energetic dance and acting in Movies and he said that he won best actor at the age of 12 for a short film named "ID" .