రానాకి లవర్‌ ఉందా?

Hero Rana has lover in Bollywood

12:57 PM ON 12th February, 2016 By Mirchi Vilas

Hero Rana has lover in Bollywood

'బాహుబలి' చిత్రంతో ఇటు ప్రభాస్‌ కి, అటు రానాకి విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో రానా కటౌట్‌ అదిరిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రంలో రానా బాడీ చూశాక బాలీవుడ్‌ లో కూడా రానాకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వచ్చేసింది. బాలీవుడ్‌ హీరోయిన్లు సైతం రానా వెంట పడుతున్నారని సమాచారం. వీరితో పాటు బాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ కూతురు కూడా రానా వెంట పడుతుందట. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా స్నేహం కొన సాగుతుందట. ఈ స్నేహం ప్రణయంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని టాక్‌. ఎంతో మంది సెలబ్రిటీలు ఆ నిర్మాత కూతురిని ప్రపోజ్‌ చెయ్యాలని చూస్తే, ఆ అమ్మాయి మాత్రం రానా వెంట పడుతుంది అంట. అయితే రానా మాత్రం ఈ విషయాన్ని చాలా లైట్‌ తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ టాక్‌.

English summary

Hero Rana has lover in Bollywood. Bollywood star producer daughter is dating with Rana from Baahubali movie onwards. She attracted with his cutout in Baahubali.