కుటుంబం సభ్యుల నడుమ  సంజయ్  ...

Hero Sanjay to spend time with his family after release

11:41 AM ON 16th March, 2016 By Mirchi Vilas

Hero Sanjay to spend time with his family after release

జైలు నుంచి వచ్చాక సినీ చాన్సులు వెంటాడుతున్నా, సంజయదత్‌ ఇప్పుడప్పుడే సినిమాల గురించి ఆలోచించేలా లేడు. కుటుంబ సభ్యులతో రెండునెలలు గడపాలని నిర్ణయించుకున్నాడు. అందుకే పూర్తి కాలం భార్యకు, పిల్లలకు అందుబాటులో ఉంటున్నాడు. సంజయ్‌ మొదటి భార్య రిచాశర్మకు ఒకే కూతురు. ఆమె పేరు త్రిశాల. రిచాశర్మ బ్రెయిన్‌ ట్యూమర్‌ బారిన పడి 1996లో చనిపోయింది. ఆమె చనిపోయాక త్రిశాల న్యూయార్క్‌ వెళ్లి పినతల్లి ఎన్నా, ఆమె తల్లిదండ్రుల వద్ద పెరుగుతూ వచ్చింది. తండ్రి జైలుపాలయ్యాక క్రిమినల్‌ జస్టిస్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసింది. 27 ఏళ్ల త్రిశాలకు ఇండియాలో స్థిరపడే ఉద్దేశ్యం లేదు. తండ్రిని చూడాలని ఈ మధ్యే ముంబై వచ్చినప్పుడు, ఆ తండ్రీకూతుళ్లిద్దరూ రిచాశర్మ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఇరవై ఏళ్ల క్రితం చివరి దశలో తల్లి రిచాశర్మ తనను ఉద్దేశించి రాసిన ఉత్తరాన్ని త్రిశాల తండ్రికి చూపించి ఏడ్చేసింది. సంజయ్‌ కళ్ళు కూడా చెమర్చాయి. 'మనమందరం కలిసే నడుస్తాం. అయితే, ఎవరి పద్ధతిలో వారు నడుచుకుంటూ వెళ్తుంటారు. కానీ నేను నడిచిన మార్గం మూసుకు పోయింది. తిరిగి వేళ్ళే దారి కానరాలేదు. వేచి ఉండక తప్పదు. వేచి వుండినా తిరిగి రాలేనని పిస్తోంది. నా కలలు పండించేందుకు దేవదూత వస్తుందేమోనని నా నిరీక్షణ. ఆ దేవదూత చేతులు చాచి జాగ్రత్తగా నన్ను అక్కున చేర్చుకుంటుందని నా అభిలాష’’ అని రిచాశర్మ అందులో రాసింది. మరి ఈ లేఖ చదివితే ఎవరికి మాత్రం కళ్లు చెమర్చవు? రిచా మరణించాక సంజయ్‌ మాన్యతను వివాహమాడాడు. ఆమెకు ఇఖ్రా, షహ్రాన్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. మొత్తానికి కుటుంబం నడుమ గడుపుతున్న సంజయ్ తో పూరి జగన్నాధ్ కూడా ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెల్సిందే. మరి సెట్స్ మీదికి వెళ్ళాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.

English summary

Dutts said, Directors like Rajkumar Hirani and Sanjay Gupta are ready with scripts as soon as Sanju comes out. But he has indicated that he wants to spend time with his family.